
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో అంధురాలైన ఓ యువతిని గంజాయి మత్తులో ఉన్న ఓ దుండగుడు నరికి చంపాడు. ఈ దారుణ ఘటన ఏపీ ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కంటి చూపులేని బాధితురాలు ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతితో నిందితుడు రాజు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బాధితురాలు కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో రాణి తల్లి నిందితుడిని నిలదీసింది.
Read Also : తెలంగాణలో యూపి ఫార్ములా…. అధికారం కోసం బిజేపి ప్లాన్
అయితే, తనకేమీ తెలియదని, రాణి తన చెల్లెలిలాంటిందని నమ్మకబలికే ప్రయత్నం చేశాడు నిందితుడు రాజు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం గంజాయి మత్తులో రాణిని అతి దారుణంగా కత్తితో నరికాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని ఆమె కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాధితురాలు తీవ్ర రక్తస్రావం కావడంతో మరణించిందని వైద్యులు నిర్ధారించారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో నిందితుడు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
Also Read : దక్షిణ టర్కీ నగరంలో 4.7 తీవ్రతతో మరోసారి భూకంపం… 34 వేలు దాటిన మృతులు
తన కూతురిని హత్య చేసిన నిందితుడు రాజును కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లి పోలీసులను కోరింది. కాగా, కొంతమంది పోలీసులతో ఉన్న స్నేహం వల్లే రాజు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఓ హెడ్ కానిస్టేబుల్ పైనా రాజు దాడి చేశాడనే ఆరోపణలున్నాయి. అంతేగాక, ఓ వివాహితపైనా గొడ్డలితో దాడి చేశాడని చెబుతున్నారు. నేరాలకు పాల్పడుతున్న రాజును అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చశారు. అలాగే, గంజాయి, మత్తుపదార్థాల సరఫరాను అరికట్టాలని కోరుతున్నారు. కాగా, నిందితుడు డీఎస్పీ ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :
- స్విమ్మింగ్‌లో సత్తా చాటిన హీరో మాధవన్ కొడుకు… ఏడు పతకాలు సాధించిన వేదాంత్
- బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారు… కేఏ పాల్
- గాంధీ ఆస్పత్రిలో కాలం చెల్లిన మందుల కలకలం… మందులు తీసుకున్న పేషంట్లలో కలవరం
- మరో శ్రీలంకలా మారిన పాకిస్తాన్.. ప్రజలపై కొత్త పన్నులు వేయడానికి రెడీ
- ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏపీ నుంచి తొలి అరెస్టు.. మాగుంట రాఘవరెడ్డి అరెస్టు
One Comment