International

దక్షిణ టర్కీ నగరంలో 4.7 తీవ్రతతో మరోసారి భూకంపం… 34 వేలు దాటిన మృతులు

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టర్కీపై భూకంపం పగబట్టినట్టుంది. మరోసారి ఆ దేశంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. దక్షిణ టర్కీ నగరమైన కహ్రామన్‌మరాస్‌కు సమీపంలో 15.7 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొంది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు భూకంపం సంభవించినట్టు వివరించారు. ప్రకృతి విలయానికి గత వారం రోజులుగా టర్కీ వాసులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గడుపుతున్నారు. భూకంపం సృష్టించిన విధ్వంసానికి ఊళ్లకు ఊళ్లే తుడుచుపెట్టుకుపోయాయి. చారిత్రక నగరాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

Read Also : గాంధీ ఆస్పత్రిలో కాలం చెల్లిన మందుల కలకలం… మందులు తీసుకున్న పేషంట్లలో కలవరం

వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. గత సోమవారం సంభవించిన భారీ భూకంపం కారణంగా టర్కీ, సిరియాలో ఇప్పటివరకు 34,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. టర్కీలో 29,000.. సిరియాలో 4,500 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. 92,600 మంది గాయపడ్డారు టర్కీ, సిరియాలో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ఇంకా కొనసాగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయడం లేదు. శిథిలాల నుంచి ఆరు రోజుల తర్వాత కూడా కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు. తాజాగా ఆరు నెలల గర్భిణీ, ఇద్దరు పిల్లలతో సహా కొంతమంది సురక్షితంగా బయటకు వచ్చారు. అయితే, భూకంపంలో అధిక ప్రాణనష్టానికి అక్రమ నిర్మాణ కార్యకలాపాలే కారణమని టర్కీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 130 మందికిపైగా కాంట్రాక్టర్లను టర్కీ న్యాయ అధికారులు విచారిస్తున్నారు.

Also Read : 14 ఏళ్లు దుబాయ్ జైలులో శిక్ష.. చివరకు మరణం నుంచి తప్పించుకుని

మరోవైపు ఇక్కడి పరిస్థితులను ఆసరాగా చేసుకుని దోపిడీలకు, మోసాలకు పాల్పడుతున్న ముఠాలను కట్టడి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. భూకంపం కారణంగా కుప్పకూలిన భవనాల నిర్మాణాలకు బాధ్యులైన 134 మందిని విచారిస్తున్నట్లు టర్కీ న్యాయ శాఖ మంత్రి బెకిర్ బోజ్‌డాగ్ వెల్లడించినట్టు టర్కీ అధికారిక మీడియా అనడోలు తెలిపింది. వీరిలో ఏడుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. చనిపోయినవారి శవాలను ఖననం చేయడానికి భూకంప ప్రభావిత ప్రాంత శ్మశానాల్లో పెద్ద ఎత్తున బుల్డోజర్లు, పొక్లెయిన్‌లు నిరంతరం పని చేస్తుండటం ఈ విలయానికి అద్దం పడుతోంది.

ఇవి కూడా చదవండి : 

  1. ప్రారంభమైన ఫార్ములా ఈ – రేస్…. తరలివచ్చిన సెలబ్రిటీలు, క్రికెటర్లు
  2. పచ్చని తెలంగాణాను పిచ్చోళ్ళ చేతుల్లో పెట్టొదు…మంత్రి కే‌టి‌ఆర్
  3. రూ.1000 కోట్లు పంచినా రాజాసింగ్‌కు ఓటేయరు.. గోషామహల్‌లో ఫ్లెక్సీల కలకలం
  4. మేం అధికారంలోకి వస్తే సచివాలయం డోమ్ కూల్చేస్తాం… బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
  5. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏపీ నుంచి తొలి అరెస్టు.. మాగుంట రాఘవరెడ్డి అరెస్టు

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.