
క్రైమ్ మిర్రర్, గచ్చిబౌలి : హైదరాబాద్‌లో డెలివరీ కేంద్రం కలిగిన అంతర్జాతీయ సంస్థ కైరోస్ టెక్నాలజీస్. వృద్ది మరియు వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తూ, కైరోస్ ఇప్పుడు పూర్తిగా అంకితం చేసిన ఆర్ అండ్ డీ కేంద్రం కె –ల్యాబ్స్‌ను ఆవిష్కరణలే లక్ష్యంగా ఏర్పాటుచేయనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. గచ్చిబౌలి జూబ్లీ ఎన్ క్లేవ్ లోని హోటల్ లీ మెరిడియన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సేవలతో అందించే విలువను వేరు చేయడానికి ఉన్న ఏకైక మార్గం ఆవిష్కరణ అని ఫౌండర్, సీఈఓ సుధాకర్ పెన్నం అన్నారు. కె ల్యాబ్స్‌లో పూర్తిగా అంకితం చేసిన పెట్టుబడులు ఉండటం చేత నూతన తరపు ఉత్పత్తులను అత్యాధునిక సాంకేతికతతో మెషీన్ లెర్నింగ్ మరియు ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ మిళితం చేసి ఆవిష్కరిస్తారని భవిష్యత్‌కు సిద్ధమైన కైరోస్ అని తెలిపారు.
Read Also : తెలంగాణలో యూపి ఫార్ములా…. అధికారం కోసం బిజేపి ప్లాన్
ఈ సందర్భాన్ని కైరోస్ మ నూతన లోగో, నేపథ్యం, శైలిని విడుదల చేశారు. ఈ నూతన గుర్తింపు అర్ధవంతంగా మా వినియోగదారులను కలుసుకోవడానికి తోడ్పడుతుందని, కైరోస్ సీఓఓ జగదీష్ మంకాల్ నమ్ముతున్నామని. మా వినియోగదారులు డిజిటల్‌గా రూపాంతరం చెందుతున్నామన్నారు. కైరోస్ పోర్ట్‌ఫోలియో మా వినియోగదారుల పొజిషనింగ్‌తో సమలేఖనం చేయడంలో మాకు సహాయపడుతుంది అని మంకాల్ వెల్లడించారు. సాంకేతికత అత్యంత వేగంగా మారుతుంది. ప్రతి రోజూ ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయని. అయితే, ఈ ఆవిష్కరణ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి సమగ్రమైన రీతిలో వినియోగదారుల అనుభవాలను ధృవీకరించడం తప్పనిసరని, కృత్రిమ మేథస్సు మరియు మెషీన్ లెర్నింగ్‌కు విస్తృత శ్రేణిలో డాటా మోడలింగ్ మరియు అభ్యాసాలు ప్రధానస్రవంతిలోకి వెళ్లక మునుపే కావాల్సి ఉంటుందన్నారు. అందువల్ల నూతన తరపు టెస్టింగ్ అనేది ఈ మోడల్స్ ధృవీకరించడానికి అవసరం పడుతుందని, అందువల్ల ఈ మోడల్స్ ధృవీకరణకు నూతన తరపు టెస్టింగ్ అవసరం పడుతుందని తెలిపారు. ఏఐ ను వాలిడేట్ చేయడానికి మేము ఏఐ నిర్మిస్తున్నామని కైరోస్ సీడీఓ కట రాధికా రావు అన్నారు.
Also Read : స్విమ్మింగ్‌లో సత్తా చాటిన హీరో మాధవన్ కొడుకు… ఏడు పతకాలు సాధించిన వేదాంత్
ఉత్తేజకరమైన సమయాలు సాహసోపేతమైన చర్యలకు పిలుపునిస్తాయని. భవిష్యత్‌ను రీ ఇంజినీర్ చేయడానికి ఇప్పుడు కంటే మెరుగైన సమయం మరియు ప్రదేశం ఉండదని రాధిక వెల్లడించారు.
ఈ నూతన బ్రాండ్ గుర్తింపు అంతర్జాతీయ సాంకేతిక ఆధారిత కంపెనీగా మార్పును స్వీకరించడం, ఆవిష్కరణలపై పెట్టుబడులు పెట్టడం, వీలైనంతగా సాధ్యమయ్యే వాటిని సాధించాలనే స్పష్టమైన లక్ష్యంతో నూతన సవాళ్లను స్వీకరించడంపై కైరోస్ దృష్టి సారించిందన్నారు. ఈ నూతన బ్రాండింగ్‌ను కంపెనీ యొక్క వారసత్వం, సాంకేతికత మరియు ఉద్యోగుల ఆధారంగా చేశారని,. ఈ మూడు అంశాలే కంపెనీ మరియు దాని పోర్ట్‌ఫోలియోకు ఆకృతిని అందించడంలో తోడ్పడ్డాయన్నారు. కైరోస్ టెక్నాలజీస్ మరియు సొలునస్ ఫౌండర్ –సీఈఓ శ్రీ సుధాకర్ పెన్నం మాట్లాడుతూ* ‘‘మా వినియోగదారులు, ప్రతి ఒక్కరూ మరియు మా కమ్యూనిటీ మరింత మెరుగ్గా ఉండటానికి కృషి చేసే సమస్యా పరిష్కారవేత్తలము మేము. స్ధిరమైన నైపుణ్యం, నూతన సమాధానాలను కనుగొనడానికి మరియు ఆలోచనలు మరియు ఆవిష్కరణలను కొనసాగించడానికి మమ్మల్ని మేము మెరుగుపరుచుకోవడం అనేవి కైరోస్ ముఖ్య లక్షణాలు డిజిటల్ నాణ్యత ఇంజినీరింగ్ పరిష్కారాలు మరియు సేవల పరంగా సమగ్రమైన మా జాబితా, వ్యాపార సంస్ధలు పూర్తి ఆత్మవిశ్వాసంతో తమ డిజిటల్ వ్యవస్ధలను విస్తరించుకోవడంలో సహాయపడటంతో పాటుగా వృద్ధి, వ్యాపార స్ధిరత్వం కోసం నిరూపితమైన మరియు అభివృద్ది చెందుతున్న సాంకేతికతలను వినియోగించుకోవడంలో సహాయపడుతుంది.
Read Also : గుంటూరు జిల్లాలో దారుణం…. గంజాయి మత్తులో యువతిని నరికి చంపిన దుండగుడు
ఈ నూతన గుర్తింపు, వాస్తవంగా ప్రపంచాన్ని మార్చడంలో సహాయపడే మా మార్గదర్శక సాంకేతికతలపై మా అభిరుచిని ప్రతిబింబిస్తుంది. ఆవిష్కరణ మరియు డిజిటల్ పరివర్తనను ప్రోత్సహించేందుకు మేము ఈ సంవత్సరం మరో 400 మంది ఉద్యోగులను నియమించుకోవాలని ప్రణాళిక చేశాము. ఇది మరింతగా మా అభిరుచి కలిగిన సాంకేతిక నిపుణులను బలోపేతం చేయనుంది’’ అని అన్నారు. ఆయనే మరింతగా వెల్లడిస్తూ ‘ మేము ఇప్పుడు రెండు నూతన ఐపీ ఆధారిత పరిష్కారాలను మా శక్తివంతమైన ఆర్ అండ్ డీ ల్యాబ్ (కె–ల్యాబ్) ద్వారా విడుదల చేస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. కిటాప్ కైరోస్ ఇంటిలిజెంట్ టెస్ట్ ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్. ఇది ఏఐ ఆధారిత లో–కోడ్ టెస్ట్ ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్. అత్యంత సౌకర్యవంతంగా సీఐ/సీడీ పైప్‌లైన్‌తో మిళితమవుతుంది. క్లయింట్ యొక్క టెస్ట్ ఇన్‌ఫ్రాపై సోర్స్ కోడ్ అమలు చేసిన మొట్టమొదటి ఏఐ శక్తివంతమైన టెస్ట్ ఆటోమేషన్ ప్లాట్‌ఫారమ్ ఇది. డిజిటల్ నెక్ట్స్ వ్యాపారాల కోసం దీనిలో ఏఐ శక్తిని, మానవ మేథస్సుతో మిళితం చేశారు. అంతేకాదు, మేము డీక్యు గేట్‌వేను సైతం పరిచయం చేశాము. డాటా క్వాలిటీ ఎస్సెస్‌మెంట్ కోసం ఆల్ ఇన్ ఒన్ నో కోడ్ సొల్యూషన్ ఇది. దీని యొక్క వినూత్నమైన డాటా నాణ్యత పరిష్కారాన్ని డాటా ఎనలిస్ట్‌ల కోసం నిర్మించడం వల్ల ఇంటరాక్టివ్ విజువల్ పద్ధతిలో క్లయింట్స్ డాటా నాణ్యతకు హామీ ఇవ్వబడుతుంది. మా వినియోగదారుల డిజిటల్ పరివర్తన కోసం ఈ ప్రొడక్ట్స్ మా సేవలు, పరిష్కారాలను మరింత మెరుగుపరుస్తాయని అన్నారు.
ఇవి కూడా చదవండి :
- బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారు… కేఏ పాల్
- గాంధీ ఆస్పత్రిలో కాలం చెల్లిన మందుల కలకలం… మందులు తీసుకున్న పేషంట్లలో కలవరం
- 14 ఏళ్లు దుబాయ్ జైలులో శిక్ష.. చివరకు మరణం నుంచి తప్పించుకుని
- పచ్చని తెలంగాణాను పిచ్చోళ్ళ చేతుల్లో పెట్టొదు…మంత్రి కేటిఆర్
- దక్షిణ టర్కీ నగరంలో 4.7 తీవ్రతతో మరోసారి భూకంపం… 34 వేలు దాటిన మృతులు