
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కొత్తగా నిర్మించిన రాష్ట్ర సెక్రటేరియట్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. కేసీఆర్ చేతుల మీదుగా సచివాలయాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లలో కూడా మునిగిపోయారు. కానీ ఇప్పుడు ప్రారంభోత్సవం కొద్దిరోజుల్లోనే ఉందనుకున్న సమయంలో వాయిదా వేశారు.
Read Also : అసెంబ్లీలో ఈటల రాజేందర్ వర్సెస్ మంత్రి కేటీఆర్…
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించగా.. నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కోడ్ అమల్లో ఉంటుంది. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో కోడ్‌ను అధికారులు అమలు చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉండటంతోనే సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా వేశామని, ఇందులో వేరే కారణం ఏమీ లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మీద హమారా ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు… కేసు నమోదు, అరెస్ట్
సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా పడటం ఇది తొలిసారి కాదు. గతంలో అనేకసార్లు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసిన తర్వాత చివరి నిమిషంలో వాయిదా పడుతూ వస్తోంది. గత నెలలో సంక్రాంతి రోజున ప్రారంభించాలని ప్రభుత్వ వర్గాలు భావించాయి. కానీ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. ఇప్పుడు మరోసారి చివరి నిమిషంలో వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రారంభోత్సవానికి మరో డేట్‌ను ఫిక్స్ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి :
- మేం అధికారంలోకి వస్తే సచివాలయం డోమ్ కూల్చేస్తాం… బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
- హిండెన్ బర్గ్ నివేదికపై కేంద్రానికి సుప్రీంకోర్ట్ డెడ్ లైన్….
- ఏపీ సీఎం జగన్‌తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ….
- సీఎం కేసీఆర్ కీలక ప్రకటన…. పోడు భూములకు రైతుబంధు, భూమి లేని వారికి గిరిజనబంధు
- కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్… త్వరలోనే అందిస్తామని మంత్రి గంగుల ప్రకటన
3 Comments