
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ విధించిన షరతులకు అంగీకరించింది. దీంతో పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం చేయడానికి ఐఎంఎఫ్ ఓకే చెప్పింది. ఆర్థికంగా దివాలా తీసిన పాకిస్తాన్ కొంతకాలంగా సాయం చేయాల్సిందిగా మిత్రదేశాలను కోరుతోంది. రుణాలు ఇవ్వలేమని మిత్రదేశాలు చేతులు ఎత్తేయడంతో చివరి అవకాశంగా ఐఎంఎఫ్ దగ్గరకు వెళ్లింది. దీంతో ఐఎంఎఫ్, పాకిస్తాన్ మధ్య దాదాపు పది రోజుల పాటు చర్చలు జరిగాయి. పాకిస్తాన్ కు ఆర్థిక సాయం చేయడానికి ఒకదశలో ఐఎంఎఫ్ అంగీకరించింది. అయితే తాము పెట్టే షరతులను అంగీకరించాలంటూ మెలిక పెట్టింది. ఇందులో పాకిస్తాన్ ప్రజలపై పన్నులు వేయడం ప్రధాన షరతు.
Read Also : ఈ నెల 13న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ… బైబై మోదీ అంటూ వెలిసిన ఫ్లెక్సీలు
ఈ షరతుకు ఓకే చెప్పడానికి పాకిస్తాన్ మొదట్లో తటపటాయించింది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భయపడింది. అయితే చివరకు మరో మార్గం లేక ఐఎంఎఫ్ షరతుల మేరకు భారీ ఎత్తున పన్నులు వేయడానికి సన్నద్ధమైంది. పాకిస్తాన్ కొన్ని నెలలుగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. మరో శ్రీలంకలా మారుతోంది. దేశంలో విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. ఈ పరిణామం చమురు దిగుమతులపై పడింది. ఫలితంగా పెట్రోలు బంకులు ఖాళీ అవుతున్నాయి. బంకుల్లో నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా పెట్రోలు బంకుల మందు బారులు తీరిన జనమే కనిపిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దాదాపు నెల రోజుల నుంచి పంజాబ్‌లో పెట్రోలు దొరకడం లేదని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా….
- అసెంబ్లీలో ఈటల రాజేందర్ వర్సెస్ మంత్రి కేటీఆర్…
- మేం అధికారంలోకి వస్తే సచివాలయం డోమ్ కూల్చేస్తాం… బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
- హిండెన్ బర్గ్ నివేదికపై కేంద్రానికి సుప్రీంకోర్ట్ డెడ్ లైన్….
- డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మీద హమారా ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు… కేసు నమోదు, అరెస్ట్
One Comment