
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తాను ఏ నేరం చేయక పోయినా దుబాయ్ జైలులో 14 ఏళ్ల పాటు శిక్ష అనుభవించాడు. కోర్టు మరణశిక్ష విధించింది. ఇక సొంతూరుకు రాలేనని అనుకున్నాడు. కుటుంబ సభ్యులను చూడలేనని బాధపడ్డాడు. అయితే శిక్ష నుంచి బయటపడిన అతను గ్రామానికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులను చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. అతని పేరు మాకురి శంకర్. నిజామాబాద్ జిల్లా మెండోర మండలానికి చెందిన ఆయన ఉపాధి కోసం 2006లో దుబాయ్ వెళ్లాడు.
Read Also : ప్రారంభమైన ఫార్ములా ఈ – రేస్…. తరలివచ్చిన సెలబ్రిటీలు, క్రికెటర్లు
అక్కడ ఓ కంపెనీలో ఫోర్ మెన్ గా చేరాడు. శంకర్ 2009లో తిరిగి స్వగ్రామానికి రావాల్సి ఉంది. అయితే ఇంతలో అనుకోని ఘటన జరిగింది. శంకర్ పనిచేస్తున్న కంపెనీలోని ఓ వ్యక్తి ఆరో అంతస్తు నుంచి కింద పడి మరణించాడు. ఇందుకు శంకరే కారణమంటూ అక్కడి కోర్టు 2013లో మరణశిక్ష విధించింది. దీనిపై మరోసారి కోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు శంకర్. దీంతో మరోసారి విచారణ సాగింది. శంకర్ దుబాయ్ వెళ్లే సమయంలో ఆయన భార్య గర్భవతి. కొద్ది రోజుల తర్వాత కుమారుడు జన్మించాడు. దుబాయ్ చట్టాల ప్రకారం మరణశిక్ష రద్దు చేయాలంటే బాధిత కుటుంబ సభ్యుల నుంచి క్షమాభిక్ష పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
Also Read : ప్రభుత్వ తీరుకు నిరసనగా బుల్లెట్ బైక్ నడుపుతూ అసెంబ్లీకి రాజాసింగ్…
దీంతో శంకర్ కుటుంబీకులు టీడీపీ నేత దేగాం యాదా గౌడ్, దుబాయ్ లోని లాయర్ అనురాధలను సంప్రదించారు. మృతుడిది రాజస్థాన్ అని తెలియడంతో అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు. రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి క్షమాభిక్ష పత్రాలను తీసుకున్నారు. అనంతరం వాటిని దుబాయ్ కోర్టులో సమర్పించడంతో శంకర్ మరణ శిక్ష నుంచి విముక్తి పొందాడు. వారం రోజుల కిందట జైలు నుంచి విడుదలయ్యాడు. 17 ఏళ్ల తర్వాత శుక్రవారం సొంతూరుకు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.
ఇవి కూడా చదవండి :
- పచ్చని తెలంగాణాను పిచ్చోళ్ళ చేతుల్లో పెట్టొదు…మంత్రి కేటిఆర్
- రూ.1000 కోట్లు పంచినా రాజాసింగ్‌కు ఓటేయరు.. గోషామహల్‌లో ఫ్లెక్సీల కలకలం
- నేటి నుంచి హైదరాబాద్‌లో ఫార్ములా ఈ – రేస్…. 20వేల మంది ప్రేక్షకులు వీక్షించేలా ఏర్పాట్లు
- ఈ నెల 13న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ… బైబై మోదీ అంటూ వెలిసిన ఫ్లెక్సీలు
- ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏపీ నుంచి తొలి అరెస్టు.. మాగుంట రాఘవరెడ్డి అరెస్టు
One Comment