
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరిని మించి ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలను రసవతంగా మారుస్తున్నారు. ఇప్పటికే పాదయాత్రలు చేస్తున్న నాయకులు సంచలన వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పుట్టిస్తుంటే, అసెంబ్లీ వేదికగా అధికార పార్టీ మంత్రులు ప్రతిపక్ష పార్టీ నేతలను తిట్టిపోస్తున్నారు. తాజాగా ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో పిచ్చోళ్ళ చేతిలో పచ్చని తెలంగాణను పెట్టొద్దని బండి సంజయ్, రేవంత్ రెడ్డి లను టార్గెట్ చేశారు.
Read Also : రూ.1000 కోట్లు పంచినా రాజాసింగ్‌కు ఓటేయరు.. గోషామహల్‌లో ఫ్లెక్సీల కలకలం
ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ ను టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పేల్చివేయాలని చేసిన షాకింగ్ వ్యాఖ్యల పైన, అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజ్ మహల్ ని పోలిన సచివాలయ గుమ్మటాలను కూల్చేస్తామంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్ పచ్చని తెలంగాణను పిచ్చోళ్ళ చేతిలో పెట్టొద్దని అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకాయన ప్రగతి భవన్ ను కూలగొడతాను అంటే.. ఇంకొక ఆయన సెక్రటేరియట్ ను కూలగొడతాను అంటున్నాడని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లను టార్గెట్ చేశారు మంత్రి కేటీఆర్. ఇక ఇదే సమయంలో తాము నిర్మాణాలు చేద్దాం.. పునాదులు తవ్వుదామంటుంటే ఒకరు సమాధులు తవ్వుదామంటున్నారని, ఇంకొకరు బాంబులు పెట్టి పేల్చేస్తామంటున్నారని.. వారంతా అరాచక శక్తులంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక అటువంటి అరాచక శక్తుల చేతుల్లోకి రాష్ట్రం పడితే ఏమవుతుందో ఆలోచించాలని అందరినీ అడుగుతున్నానని పేర్కొన్న కేటీఆర్ పచ్చగా ఉన్న తెలంగాణని, పచ్చని మాగాణంగా మారిన తెలంగాణను పిచ్చోళ్ళ చేతుల్లో పెట్టొద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. పేలుస్తాము.. కూలుస్తాము అని అరాచక మాటలు తప్ప నిర్మాణాత్మకమైన వైఖరి లేని పార్టీలను తిరస్కరించాలని ప్రజలను కోరుతున్నానని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Also Read : నేటి నుంచి హైదరాబాద్‌లో ఫార్ములా ఈ – రేస్…. 20వేల మంది ప్రేక్షకులు వీక్షించేలా ఏర్పాట్లు
చివరికి రేవంత్ రెడ్డి , బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అరాచక శక్తులు చేసిన వ్యాఖ్యలుగా, ఉన్మాదంతో చేసిన వ్యాఖ్యలుగా, పిచ్చోళ్ళు చేసిన వ్యాఖ్యలుగా మంత్రి కేటీఆర్ అభివర్ణించడం, ఆపై ప్రజలకు పిచ్చోళ్ళ చేతిలో తెలంగాణ అని పెట్టొద్దు అంటూ విజ్ఞప్తి చేయడం రాజకీయ వర్గాలలోనే కాదు, ప్రజలలోను ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. రాజకీయాలలో సంచలనాల కోసం చూస్తున్న నాయకులు మాట్లాడే మాటలు ఆచితూచి మాట్లాడాలని, లేదంటే వాటి ప్రభావం సదరు నాయకుల పైన మాత్రమే కాకుండా ఆయా రాజకీయ పార్టీల పైన కూడా పడుతుంది. ఇప్పుడు బండి సంజయ్, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని, బిజెపిని కూడా టార్గెట్ చేస్తున్నారు అధికార పార్టీ నాయకులు.
ఇవి కూడా చదవండి :
- ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏపీ నుంచి తొలి అరెస్టు.. మాగుంట రాఘవరెడ్డి అరెస్టు
- మరో శ్రీలంకలా మారిన పాకిస్తాన్.. ప్రజలపై కొత్త పన్నులు వేయడానికి రెడీ
- ఈ నెల 13న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ… బైబై మోదీ అంటూ వెలిసిన ఫ్లెక్సీలు
- తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా….
- మోగిన ఎంఎల్‌సి ఎన్నికల నగారా… రెండు తెలుగు రాష్ట్రాలలో 15 స్థానాలకు ఎన్నిక