
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కలకలం రేపుతోన్నాయి. ఈ నెల 13న హైదరాబాద్ పర్యటనకు మోదీ రానున్న క్రమంలో.. నగరంలో వెలిసిన ఫ్లెక్సీలు పెను దుమారం సృష్టిస్తున్నాయి. సోమవారం హైదరాబాద్ రానున్న మోదీ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిర్మించనున్న నూతన భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. మోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో వ్యతిరేకంగా నగరంలో పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను విమర్శిస్తూ సెటైరికల్‌గా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు హల్‌చల్ సృష్టిస్తున్నాయి.
Read Also : తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా….
ఇటీవల కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. ఇది అమృత్ కాల్ బడ్జెట్ అని పేర్కొన్నారు. దీంతో ఇది అమిత్ కాల్ బడ్జెట్ కాదని, కాళకూట బడ్జెట్ అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. బైబై మోదీ అని ఫ్లెక్సీలో కనిపిస్తోంది. అలాగే మోదీ ప్రభుత్వంలో 2014 నుంచి 2023 వరకు ఇండియా గ్రోత్ గురించి కార్టూన్ల ద్వారా ఈ ఫ్లెక్సీలో సెటైర్ పేల్చారు. ఒక మనిషి హెయిర్ 2014 నుంచి కొద్దికొద్దిగా ఊడిపోతూ 2023 నాటికి బట్టతల వచ్చినట్లు చూపించారు. మోదీ పాలనలో దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారిపోతుందని అర్ధం వచ్చేలా ఈ కార్టూన్ ఉంది. అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారనేది మాత్రం అందులో లేదు. దీంతో ప్రత్యర్థి పార్టీల నేతలు ఏర్పాటు చేసి ఉంటారని కాషాయ నేతలు మండిపడుతున్నారు.
Also Read : హిండెన్ బర్గ్ నివేదికపై కేంద్రానికి సుప్రీంకోర్ట్ డెడ్ లైన్….
ఇక మోదీకి మద్దతుగా కూడా ఫ్లెక్సీలు బస్టాప్‌లలో వెలుస్తున్నాయి. ‘అమృత్ కాల్ బడ్జెట్ సమర్పించినందుకు ధన్యవాదాలు.. తెలంగాణ మధ్య తరగతి ప్రజలు’ అనే ఫ్లెక్సీలు కొంతమంది ఏర్పాటు చేశారు. కొంతమంది మోదీకి మద్దతుగా ఏర్పాటు చేస్తుండగా.. ప్రత్యర్ధులు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈ ఫ్లెక్సీల వార్ టీ పాలిటిక్స్‌లో హీట్ పుట్టిస్తోంది. మోదీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు వెలవడం ఇది తొలిసారి కాదు. గతంలో పలుమార్లు మోదీ నగర పర్యటనకు వచ్చిన సమయంలో కూడా వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో గిట్టనివారు కొంతమంది ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని కాషాయ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- అసెంబ్లీలో ఈటల రాజేందర్ వర్సెస్ మంత్రి కేటీఆర్…
- మేం అధికారంలోకి వస్తే సచివాలయం డోమ్ కూల్చేస్తాం… బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
- డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మీద హమారా ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు… కేసు నమోదు, అరెస్ట్
- ఏపీ సీఎం జగన్‌తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ….
- కేఏ పాల్ భద్రత తొలగింపుపై డిజిపికి హై కోర్ట్ కీలక ఆదేశాలు…
One Comment