
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : గోషామహల్ లో ఎమ్మెల్యే రాజసింగ్‌కు వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. 1000 కోట్ల సవాల్ కు ప్రతి సవాల్ విసురుతూ BRS నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. గోశామహల్‌లోని కోఠి, అబిడ్స్, ఎంజే మార్కెట్, సీబీఎస్ , జుమెరాత్ బజార్ ప్రధాన చౌరస్తాలలో ఈ ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు. రాజాసింగ్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు అయిన ఈ ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ నేతలకు రాజాసింగ్ సవాల్ విసిరారు.
Read Also : నేటి నుంచి హైదరాబాద్‌లో ఫార్ములా ఈ – రేస్…. 20వేల మంది ప్రేక్షకులు వీక్షించేలా ఏర్పాట్లు
రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా వచ్చే ఎన్నికల్లో తనను ఓడించలేరని, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకపోయినా తాను గెలుస్తానంటూ రాజాసింగ్ పేర్కొన్నారు. ఓటుకు రూ.లక్ష ఇచ్చినా బీఆర్ఎస్ అభ్యర్ధి గెలవడం కష్టమేనని జోస్యం చెప్పారు. ఈ సారి కూడా గోషామహల్ నుంచే పోటీ చేస్తానని, అత్యధిక మెజార్టీతో గెలుస్తానంటూ ఛాలెంజ్ చేశారు. ఈ ఛాలెంజ్‌కు ఇప్పుడు బీఆర్ఎస్ నేత రిప్లై ఇస్తూ నియోజకవర్గంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కానీ రాజాసింగ్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. బీజేపీ ఆయనను పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేయగా.. సప్పెన్షన్ ఇంకా ఎత్తివేయలేదు.
Also Read : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏపీ నుంచి తొలి అరెస్టు.. మాగుంట రాఘవరెడ్డి అరెస్టు
పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పారంటూ రాజాసింగ్‌కు బీజేపీ నోటీసులు జారీ చేసింది. రాజాసింగ్ కూడా ఆ నోటీసులకు రిప్లై ఇచ్చారు. కానీ సస్పెన్షన్ ఎత్తివేసి మళ్లీ పార్టీలోకి తీసుకోవడంపై బీజేపీ సైలెంట్‌గా వ్యవహరిస్తోంది. అయితే తనకు బీజేపీ పార్టీ అంతే ఇష్టమని, మోదీ, అమిత్ షాలకు అభిమానినని రాజాసింగ్ చెబుతున్నారు. మోదీ, అమిత్ షాలతోనే ఉంటానని అంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో రాజాసింగ్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. బీజేపీ నుంచే పోటీ చేస్తారా? లేదా ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగుతారా? అనేది వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి :
- మరో శ్రీలంకలా మారిన పాకిస్తాన్.. ప్రజలపై కొత్త పన్నులు వేయడానికి రెడీ
- ఈ నెల 13న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ… బైబై మోదీ అంటూ వెలిసిన ఫ్లెక్సీలు
- ఈ నెల 13న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ… బైబై మోదీ అంటూ వెలిసిన ఫ్లెక్సీలు
- తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా….
- అసెంబ్లీలో ఈటల రాజేందర్ వర్సెస్ మంత్రి కేటీఆర్…
One Comment