
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బుల్లెట్ బండిపై రావడం ఆసక్తి రేపింది. హెల్మెట్ పెట్టుకుని బుల్లెట్ బైక్ నడుపుకుంటూ వచ్చిన రాజాసింగ్‌ను పోలీసులు ఆపి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయనను లోపలికి పంపించారు. రాజాసింగ్ బుల్లెట్ బైక్ నడుపుతుండగా.. వెనుక ఆయన గన్‌మెన్ కూర్చుని కనిపించారు. స్వయంగా బుల్లెట్ బైక్ డ్రైవ్ చేసుకుంటూ అసెంబ్లీకి హాజరైన రాజాసింగ్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తనకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన పాత బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్ చెడిపోవడం, ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కొత్త వాహనం ఇవ్వకపోవడంతో.. దానికి నిరసనగా అసెంబ్లీకి బుల్లెట్ బైక్‌పై వచ్చినట్లు తనను ఆపి ప్రశ్నించిన పోలీసులకు రాజాసింగ్ తెలిపారు.
Read Also : పచ్చని తెలంగాణాను పిచ్చోళ్ళ చేతుల్లో పెట్టొదు…మంత్రి కేటిఆర్
గేటు నంబర్ 2 నుంచి ఆయన అసెంబ్లీ లోపలికి వెళ్లారు. రాజాసింగ్ బైక్‌పై రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇటీవల అసెంబ్లీ సెషన్ పూర్తైన తర్వాత ప్రభుత్వం రాజాసింగ్‌కి కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్‌లో ఇంటికి వెళుతుండగా.. మధ్యలో అది బ్రేక్‌డౌన్ అయింది. మార్గం మధ్యలో టైర్ పేలిపోయి ఊడిపడింది. కారు చిన్నగా వెళుతుండటంతో.. ఎలాంటి ప్రమాదం జరగలేదు. రాజాసింగ్ సురక్షితంగా బయటపడటంతో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. వెహికల్ టైర్ ఊడిపోయిన తర్వాతి రోజు ప్రగతిభవన్ వద్ద బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్‌ను రాజాసింగ్ వదిలిపెట్టి వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. చెడిపోయిన బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్‌ను ప్రగతిభవన్ వద్దకు తీసుకొచ్చిన రాజాసింగ్.. కేసీఆర్‌ను కలిసి తన సమస్యను చెబుతానని, లోపలికి అనుమతించాలని పోలీసులను కోరారు.
Also Read : రూ.1000 కోట్లు పంచినా రాజాసింగ్‌కు ఓటేయరు.. గోషామహల్‌లో ఫ్లెక్సీల కలకలం
రాజాసింగ్‌ను అడ్డుకున్న పోలీసులు లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో ఆయన అసహనంతో బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్‌ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాజాసింగ్‌ను డీసీఎం వాహనంలో అసెంబ్లీలో వదిలిపెట్టారు. రాజాసింగ్ బుల్లెట్ ఫ్రూఫ్ కారు గతంలో అనేకసార్లు మొరాయించింది. రోడ్డు మధ్యలో గతంలో మూడుసార్లు మొండికేయడంతో.. రాజాసింగ్ వేరే వాహనంలో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. గతంలో ఒకసారి రోడ్డు మీద ఆగిపోవడంతో.. రాజాసింగ్ ఆటోలో ఇంటికెళ్లారు. తనకు కొత్త బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని కేటాయించాలని గతంలో ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్ర డీజేపీని కూడా కలిసి తన సమస్యను చెప్పుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రాజాసింగ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందులో భాగంగా వినూత్నంగా తన నిరసన తెలుపుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- నేటి నుంచి హైదరాబాద్‌లో ఫార్ములా ఈ – రేస్…. 20వేల మంది ప్రేక్షకులు వీక్షించేలా ఏర్పాట్లు
- ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏపీ నుంచి తొలి అరెస్టు.. మాగుంట రాఘవరెడ్డి అరెస్టు
- ఈ నెల 13న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ… బైబై మోదీ అంటూ వెలిసిన ఫ్లెక్సీలు
- తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా….
- మరో శ్రీలంకలా మారిన పాకిస్తాన్.. ప్రజలపై కొత్త పన్నులు వేయడానికి రెడీ
One Comment