HyderabadTelangana

ప్రారంభమైన ఫార్ములా ఈ – రేస్…. తరలివచ్చిన సెలబ్రిటీలు, క్రికెటర్లు

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీల ప్రారంభంతో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. గంటలకు 220 కిలోమీటర్ల వేగంతో 22 మంది డ్రైవర్లు పోటీల్లో తమ వాహనాలతో దూసుకుపోతున్నారు. మెరుపువేగంతో దూసుకెళ్తోన్న ఈ కార్లను చూస్తూ.. ప్రేక్షకులు కేరింతలు కొడుతున్నారు. కాగా.. ఈ రేసింగ్‌లో మహీంద్రా గ్రూప్ హోం టీంగా పాల్గొంటోంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు రాజకీయ ప్రముఖులు, సెలెబ్రిటీలు, క్రికెటర్లు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.

Read Also : ప్రభుత్వ తీరుకు నిరసనగా బుల్లెట్ బైక్ నడుపుతూ అసెంబ్లీకి రాజాసింగ్…

కాగా.. మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు. అంతర్జాతీయంగా 24 సిటీలు పాల్గొంటున్న ఈ రేసింగ్.. హైదరాబాద్‌లో జరగటం గర్వకారణమని కేటీఆర్ తెలిపారు. ఈ పోటీల వల్ల హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, భారత్‌కు కూడా ప్రపంచపటంలో మంచి గుర్తింపు లభించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఈ పోటీల్లో హోం టీం మహీంద్రాను సపోర్ట్ చేసేందుకు మెగా పవర్ స్టార్ రాంచరణ్ పాల్గొన్నారు. అంతేకాదు.. హీరోయిన్ శ్రుతిహాసన్, దుల్కర్ సల్మాన్ సైతం ఈ పోటీలను గ్యాలరీ నుంచి ప్రత్యక్షంగా వీక్షించారు.

Also Read : పచ్చని తెలంగాణాను పిచ్చోళ్ళ చేతుల్లో పెట్టొదు…మంత్రి కే‌టి‌ఆర్

ఎనిమిదేళ్లలో తొలిసారిగా ఈ రేసింగ్‌లో పాల్గొంటున్నట్టు రాంచరణ్ తెలిపారు. ఈ పోటీలు హైదరాబాద్‌లో నిర్వహించటం ప్రౌడ్ మూమెంట్ అన్నారు రామ్ చరణ్. ఇదిలా ఉంటే.. మాజీ క్రికెట్ సచిన్ టెండుల్కర్‌తో శిఖర్ ధావన్, దీపక్ చాహర్ లాంటి క్రికెటర్లు కూడా గ్యాలరీల్లో సందడి చేశారు. ఫార్ములా ఈ రేసింగ్‌ను ప్రత్యక్షంగా వీక్షిస్తూ.. ఆ మజాను ఆస్వాధించేందుకు.. ఓవైపు సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున రావటం.. సామాన్య ప్రజలు కూడా భారీ ఎత్తున తరలిరావటంతో.. ట్యాంక్‌బండ్ పరిసరాలు, గ్యాలరీల్లో కోలాహలం నెలకొంది.

ఇవి కూడా చదవండి : 

  1. రూ.1000 కోట్లు పంచినా రాజాసింగ్‌కు ఓటేయరు.. గోషామహల్‌లో ఫ్లెక్సీల కలకలం
  2. నేటి నుంచి హైదరాబాద్‌లో ఫార్ములా ఈ – రేస్‌…. 20వేల మంది ప్రేక్షకులు వీక్షించేలా ఏర్పాట్లు
  3. ఈ నెల 13న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ… బైబై మోదీ అంటూ వెలిసిన ఫ్లెక్సీలు
  4. తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా….
  5. మరో శ్రీలంకలా మారిన పాకిస్తాన్.. ప్రజలపై కొత్త పన్నులు వేయడానికి రెడీ

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.