
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఫార్ములా ఈ – రేస్ కి నేటి నుంచి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇప్పటికే ఈ రేసుకి సంబంధించి ఎనిమిది సీజన్లు ముగియగా.. తొమ్మిదో సీజన్‌లో నాలుగో రేసు ఈరోజు నుంచి హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌లో జరగనుంది. ఈ రేసులో 11 జట్లు పోటీపడుతుండగా మొత్తం 22 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. ఇండియా నుంచి మహీంద్రా రేసింగ్ బరిలో ఉంది. అలానే టాటా, టీసీఎస్ టీమ్స్ కూడా పోటీపడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో రేసు కోసం ‘హైదరాబాద్ స్ట్రీ సర్క్యూట్’ని రెడీ చేశారు. ఈ సర్క్యూట్ పొడవు 2.8 కిమీ పొడవుకాగా.. 18 మలుపుల్ని ఏర్పాటు చేశారు. రేసుని దాదాపు 20 వేల మంది ప్రేక్షకులు కూర్చుని వీక్షించేలా గ్యాలరీను సిద్ధం చేశారు.
Read Also : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏపీ నుంచి తొలి అరెస్టు.. మాగుంట రాఘవరెడ్డి అరెస్టు
ఈరోజు ఉదయం క్వాలిఫయింగ్ రేసు జరిగింది. మధ్యాహ్నం 3 నుంచి మెయిన్ రేసు స్టార్ట్‌కానుంది. ఫార్ములా-ఈకి ఆతిథ్యమిస్తున్న30వ సిటీ హైదరాబాద్. మెయిన్ రేసు దాదాపు గంటన్నరపాటు జరగనుండగా.. ఈ-రేసు వీక్షించేందుకు ఈరోజు సెలెబ్రిటీలు కూడా వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం ఫ్రీ ప్రాక్టీస్ రేసు జరిగింది. ఆ రేసుని వీక్షించేందుకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి, జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి, మహేష్ బాబు భార్య నమ్రత వచ్చారు. హుస్సేన్‌సాగర్ తీరంలో జరగబోతున్న ఈ రేసులో అభిమానులకి సపోర్ట్ చేసేందుకు ఎంబీఏ చదువుతున్న విద్యార్థులు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు.
Also Read : మరో శ్రీలంకలా మారిన పాకిస్తాన్.. ప్రజలపై కొత్త పన్నులు వేయడానికి రెడీ
శనివారం ఫ్రీ ప్రాక్టీస్ రేసు టైమ్‌లో చిన్న అపశృతి చోటు చేసుకుంది. 18వ మలుపు వద్ద ఫోర్షే డ్రైవర్ ట్రాక్ పక్కన ఉన్న గోడని వేగంగా వెళ్లి ఢీకొట్టాడు. అయితే డ్రైవర్‌కి గాయాలు కాలేదు. కానీ కారు మాత్రం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఫ్రీ ప్రాక్టీస్ టైమ్‌లోనే సడన్‌గా ట్రాక్‌పై సాధారణ వాహనాలు కూడా వచ్చేశాయి. పోలీసుల భద్రతా లోపం కారణంగా ఎన్టీఆర్ మార్గ్ ఎంట్రన్స్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లని పక్కకి తొలగించిన వాహనదారులు ట్రాక్‌పైకి వచ్చేశారు. అయితే.. సమాచారం అందుకున్న అధికారులు వాహనాల్ని మళ్లీ వెనక్కి మళ్లించారు.
ఇవి కూడా చదవండి :
- ఈ నెల 13న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ… బైబై మోదీ అంటూ వెలిసిన ఫ్లెక్సీలు
- తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా….
- డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మీద హమారా ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు… కేసు నమోదు, అరెస్ట్
- మేం అధికారంలోకి వస్తే సచివాలయం డోమ్ కూల్చేస్తాం… బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
- అసెంబ్లీలో ఈటల రాజేందర్ వర్సెస్ మంత్రి కేటీఆర్…
One Comment