
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏపీలో తొలి అరెస్టు చోటుచేసుకొంది. ఏపీకీ చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో లిస్టులో ఉన్న తెలంగాణ నేతల్లో గుబులు మొదలైంది.ఎమ్మెల్సీ కవిత చుట్టు ఉన్న వారు ఒకరి తర్వాత మరొకరు అరెస్టు అవుతుండటంతో నెక్ట్స్ బిగ్ వికెట్ అంటూ ప్రచారం సాగుతొంది. సౌత్ గ్రూపులో మాగుంట రాఘవ కీలకపాత్ర పోషించారని ఈడీ అధికారులు చార్జీషీట్ లో ప్రస్తావించారు.
Read Also : మరో శ్రీలంకలా మారిన పాకిస్తాన్.. ప్రజలపై కొత్త పన్నులు వేయడానికి రెడీ
శరత్ చంద్రారెడ్డి తర్వాత రాఘవ కీ రోల్ పోషించినట్లు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో ఈడీ అధికారులు పేర్కొన్నారు.బాలాజీ గ్రూపు పేరిట లిక్కర్ దందాలో రాఘవ పలు షాపులు దక్కించుకున్నాడని, హోల్ సేల్ వ్యాపారుల పేరిట కేజ్రీవాల్ ఇచ్చిన 12శాతం కమిషన్ లో సింహభాగం ఈయనకే దక్కిందని ఆరోపణలున్నాయి. ఎమ్మెల్సీ కవిత ఆమె అనుచరుడు అభిషేక్ రావు, ఆడిటర్ బుచ్చిబాబులతోనూ రాఘవ పలు సమావేశాల్లో పాల్గొన్నట్లు ఈడీ అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణకు సంబంధించి ఈ కేసులో ఇప్పటి వరకు అభిషేక్ రావు, బుచ్చిబాబు, శరత్ చంద్రా రెడ్డి అరెస్టు అయ్యారు.
Also Read : ఈ నెల 13న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ… బైబై మోదీ అంటూ వెలిసిన ఫ్లెక్సీలు
మీడియా యజమాని గౌతమ్ ముత్తా, అభిషేక్ బంధువు లుపిన్, ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడు శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కవిత పేర్లను పలుమార్లు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో సీబీఐ, ఈడీ పేర్కొన్నారు. వందకోట్ల రూపాయలను ఆప్ అగ్రనేతలకు పంపించడంతో పాటు మద్యం పాలసీ రూపకల్పన నుంచి చివరి వరకు సౌత్ గ్రూపులో కీలక పాత్ర పోషించిన వారు ఇంకా చాలామంది ఉండటంతో తదుపరి అరెస్టు ఏవరో అనే చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా….
- డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మీద హమారా ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు… కేసు నమోదు, అరెస్ట్
- హిండెన్ బర్గ్ నివేదికపై కేంద్రానికి సుప్రీంకోర్ట్ డెడ్ లైన్….
- మేం అధికారంలోకి వస్తే సచివాలయం డోమ్ కూల్చేస్తాం… బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
- అసెంబ్లీలో ఈటల రాజేందర్ వర్సెస్ మంత్రి కేటీఆర్…
2 Comments