
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ మళ్లీ అరెస్ట్ అయ్యారు. సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీస్ ప్రగతిభవన్ వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెడిపోయిన తన బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్‌ను ప్రగతిభవన్ వద్ద వదిలేసి రాజాసింగ్ వెళుతున్నారు. ఇది గమనించిన పోలీసులు.. ఆయనను అరెస్ట్ చేశారు. గతంలో రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేయగా.. ఇప్పుడు మరోసారి ఆయనను అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజాసింగ్‌ను ప్రగతిభవన్ వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయన ఎక్కడ వదలమని చెబితే అక్కడ వదిలిపెడతామని చెబుతున్నారు.
Read Also : ఎస్‌ఎస్‌ఎల్‌వి డీ2 ప్రయోగం విజయవంతం… నింగిలోకి మూడు ఉపగ్రహాలు
రాజాసింగ్ అరెస్ట్‌పై ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. గురువారం అసెంబ్లీ నుంచి రాజాసింగ్ తన ఇంటికి వెళుతుండగా.. మార్గం మధ్యలో ఆయనకు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం ఆగిపోయింది. కారు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే ఈ ఘటనలో రాజాసింగ్‌కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. తనకు ప్రభుత్వం పాత బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం కేటాయించిందని, అది రోడ్డు మధ్యలో ఆగిపోతుందని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్లెట్ ఫ్రూఫ్ వెహికల్‌ను వాపసు తీసుకుని వేరేది కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్తది ఇవ్వకపోతే తాను సమకూర్చుకుంటానని రాజాసింగ్ చెబుతున్నారు.
Also Read : కేఏ పాల్ భద్రత తొలగింపుపై డిజిపికి హై కోర్ట్ కీలక ఆదేశాలు…
బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం తరచూ చెడిపోతుందని పోలీస్ అధికారులు చెప్పానని, రిపేర్ చేసి పాత వెహికల్‌నే మళ్లీ తిరిగి పంపిస్తున్నారని రాజాసింగ్ మండిపడుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే పాత వెహికల్‌ను ప్రగతిభవన్ దగ్గర వదిలేసి వెళ్లిపోయినట్లు రాజాసింగ్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తనకు కొత్త వాహనం కేటాయించాలని డిమాండ్ చేస్తోన్నారు. తనకు ప్రాణహాని ఉందని ప్రభుత్వం గతంలో బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం కేటాయించిందని, కానీ అది తరచూ మరమ్మతులకు గురవుతుందని చెప్పారు. ఒకసారి రోడ్డు మధ్యలో ఆగిపోవడంతో ఆటోలో ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. ఇలా అనేకసార్లు ఆగిపోవడంతో వేరే వాహనంలో ఇంటికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. గతంలో కేసీఆర్‌కు కూడా దీనిపై లేఖ రాశానని, కానీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
- డీసీఎం -కారు ఢీ… నలుగురు వ్యక్తుల దుర్మరణం
- కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్… త్వరలోనే అందిస్తామని మంత్రి గంగుల ప్రకటన
- నేడు హైదరాబాద్‌కు అమిత్ షా…. బీజేపీ నేతలతో సమావేశం
- రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి….
- ఎమ్మెల్యే రాజసింగ్‌కు తప్పిన ప్రమాదం… రోడ్డు మధ్యలో ఊడిపోయిన కారు టైర్
One Comment