
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని శ్రీశైలం జాతీయా రహదారిపైన తుమ్మలూరు గేట్ సమీపంలో (మ్యాక్ ప్రాజెక్టు)వద్ద డీసీఎం షిఫ్ట్ కారు ఢీకొని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.వీరంతా హైదరాబాదులో జరిగిన శుభకార్యంలో వంట చేసేందుకు వెళ్లి తిరిగి స్వగ్రామం కారులో వస్తుండగా తెల్లవారు జామున ప్రాంతంలో ఈదుర్ఘటన చోటుచేసుకుంది.
మృతులు నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ కు చెందిన కేశవులు, శ్రీనివాసులు, యాదయ్య, రామస్వామి గా గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి :
- కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్… త్వరలోనే అందిస్తామని మంత్రి గంగుల ప్రకటన
- కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్… త్వరలోనే అందిస్తామని మంత్రి గంగుల ప్రకటన
- రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి….
- ఎన్నెండ్లు ఈ నిరీక్షణ… నిరుద్యోగ భృతి పై ఊసేలేదు..ఇచ్చేది డౌటేనా…??
- అసెంబ్లీలో ధరణి పోర్టల్ పై వాడీ వెడీ చర్చ… కాంగ్రెస్ ఎంఎల్‌ఏల వాకౌట్….