
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లి వెళ్లిన పొంగులేటి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో భేటీ అయ్యారు. పొంగులేటి జగన్‌ను కలవడంతో రకరకాల ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో భారీ రాజకీయ మార్పులు ఖాయమనే చర్చ జరుగుతోంది. కొన్నాళ్లుగా పొంగులేటి బీఆర్ఎస్‌ను వీడతారని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని కొందరు బీజేపీలో చేరతారని మరికొందరు అంటున్నారు. కానీ షర్మిల పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : సీఎం కేసీఆర్ కీలక ప్రకటన…. పోడు భూములకు రైతుబంధు, భూమి లేని వారికి గిరిజనబంధు
జగనన్న ఆశీస్సులతో రాజకీయాలలోకి వచ్చాను. రాజకీయలోకి వచ్చిన 13 నెలలోనే ప్రజల అభిమానం పొంది ఎంపీ అయ్యాను. పార్లమెంటు సభ్యుడిని అని గర్వం లేకుండా ఎప్పుడూ మీ తోనే కలిసి మమేకమై ఉన్నాను. గడిచిన నాలుగు సంవత్సరాలల్లో ఎన్ని అవమానాలు జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు’ అని ఇటీవల పొంగులేటి వ్యాఖ్యానించారు. 2014లో పొంగులేటి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో.. ఆయన అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు మళ్లీ పోటీ చేసే అవకాశం రాలేదు. అప్పటినుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే జిల్లాలోని పలు చోట్ల పొంగులేటి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పొంగులేటి వైఎస్సార్‌టీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలతో భేటీ అయిన పొంగులేటి వైఎస్ విజయమ్మతో కూడా సమావేశం అయ్యారు.
Read Also : ప్రగతిభవన్ వద్ద గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్…
తాజా రాజకీయాలపై చర్చించారు. వైఎస్‌ఆర్‌టీపీ కీలక నేతలతో పొంగులేటి రెండోసారి భేటీ కావడంతో.. తెలంగాణలో కొత్త చర్చ జరిగింది. పార్టీ మారుతారనే ప్రచారంతో ఆ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు షర్మిల సొదరుడు వైఎస్ జగన్‌ను కలవడంతో.. పొంగులేటి వైఎస్సార్టీపీలో చేరడం దాదాపు ఖాయం అని తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణ, ముఖ్యంగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో భారీ మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది. అయితే కేసీఆర్‌కు, జగన్‌కు మంచి సంబంధాలున్నాయి. కేసీఆర్‌తో కయ్యం పెట్టుకోవడానికి జగన్ సిద్ధంగా లేరు. తెలంగాణ ప్రభుత్వంతో విభేదాలు సృష్టించుకోవడం ఇష్టం లేదని అందుకే తెలంగాణలో వైఎస్సార్సీపీని విస్తరించడం లేదని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జగన్‌ను కలిశారు. అయితే పొంగులేటికి జగన్ ఏం సూచిస్తారు పొంగులేటి ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి :
- ఎస్‌ఎస్‌ఎల్‌వి డీ2 ప్రయోగం విజయవంతం… నింగిలోకి మూడు ఉపగ్రహాలు
- కేఏ పాల్ భద్రత తొలగింపుపై డిజిపికి హై కోర్ట్ కీలక ఆదేశాలు…
- డీసీఎం -కారు ఢీ… నలుగురు వ్యక్తుల దుర్మరణం
- కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్… త్వరలోనే అందిస్తామని మంత్రి గంగుల ప్రకటన
- నేడు హైదరాబాద్‌కు అమిత్ షా…. బీజేపీ నేతలతో సమావేశం
One Comment