
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఇవాళ మరో అద్భుతమైన ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసింది. మూడు ప్రయోగాత్మక శాటిలైట్లను మోసుకెళ్లే చిన్న తరహా వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ డీ2ను నింగిలోకి ప్రయోగించింది. సరిగ్గా ఉదయం 9.18 నిమిషాలకు శ్రీహరికోట నుంచి మూడు శాటిలైట్లను రాకెట్ విజయవంతంగా మోసుకెళ్లింది. మూడు దశల్లో ఇది అంతరిక్షానికి చేరబోతోంది. మూడు ఉపగ్రహాలు EOS-07, Janus-1, AzaadiSAT-2 ను 450 కి.మీ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం-SSLV-D2-ని ఇస్రో ప్రయోగించింది. అభివృద్ధి చెందుతున్న చిన్న, సూక్ష్మ వాణిజ్య శాటిలైట్ మార్కెట్‌ను అందిపుచ్చుకునే లక్ష్యంతో ఈ ప్రయోగం చేపట్టారు.
Read Also : కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్… త్వరలోనే అందిస్తామని మంత్రి గంగుల ప్రకటన
సాధారణంగా ఇస్రో ఓ పీఎస్ఎల్వీ వాహక నౌకను అంతరిక్షంలోకి ప్రయోగించాలంటే కనీసం 600 మంది శాస్త్రవేత్తలు పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఈ చిన్న వాహక నౌక ఎస్ఎస్ఎల్వీ-డీ2ను ఓ చిన్న బృందం అతి తక్కువ సమయంలోనే రూపొందించింది. ఇవాళ ప్రయోగించిన అంతరిక్ష వాహన నౌక ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపడానికి ద్రవ-ఇంధన-ఆధారిత వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ ను, తర్వాత మూడు ఘన దశలను ఉపయోగిస్తుంది. కోవిడ్ కారణంగా పలుమార్లు ఆలస్యమైనా గత ఆగస్టులో ప్రయోగించిన ఈ నౌక ఉపగ్రహాలను ఖచ్చితమైన కక్ష్యలోకి పంపడంలో విఫలమైంది. రెండవ దశ విభజన సమయంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో పలు మార్పులు చేసి మరోసారి ఇవాళ ప్రయోగించారు.
ఇవి కూడా చదవండి :
- నేడు హైదరాబాద్‌కు అమిత్ షా…. బీజేపీ నేతలతో సమావేశం
- కేఏ పాల్ భద్రత తొలగింపుపై డిజిపికి హై కోర్ట్ కీలక ఆదేశాలు…
- డీసీఎం -కారు ఢీ… నలుగురు వ్యక్తుల దుర్మరణం
- ఎన్నెండ్లు ఈ నిరీక్షణ… నిరుద్యోగ భృతి పై ఊసేలేదు..ఇచ్చేది డౌటేనా…??
- అసెంబ్లీలో ధరణి పోర్టల్ పై వాడీ వెడీ చర్చ… కాంగ్రెస్ ఎంఎల్‌ఏల వాకౌట్…
One Comment