
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తన భద్రత తొలగింపుపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. తన భద్రతను తొలగించిందంటూ కేఏ పాల్ హైకోర్టుకు లేఖ రాశారు. ఈ క్రమంలో కేఏ పాల్ లేఖను సుమోటాగా స్వీకరించిన హైకోర్టు.. విచారణ చేపట్టింది. దీనిపై 30 రోజుల్లోగా కేఏ పాల్ త్రెట్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. అయితే, వాదనల సందర్భంగా సచివాలయం అగ్ని ప్రమాదం ఘటనను కేఏ పాల్ ప్రస్తావించగా.. ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం తరపు న్యాయవాదిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also : కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్… త్వరలోనే అందిస్తామని మంత్రి గంగుల ప్రకటన
సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, ఘటన జరిగి వారం రోజులు గడిచినా ప్రమాదంపై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కేఏ పాల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.పాత సచివాలయం నుంచి పది మంది సీఎంలు పరిపాలన సాగించారని ఈ సందర్భంగా కేఏ పాల్ గుర్తు చేశారు. సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీబీఐతో విచారణకు ఆదేశించాలని కోరారు. రూ. 500 కోట్ల విలువైన భవనాన్ని కేవలం వాస్తు పేరుతో కూల్చేశారని.. కొత్త సచివాలయం పేరుతో మరో రూ. 660 కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని హైకోర్టుకు వివరించారు కేఏ పాల్. ఈ క్రమంలో ఇతర అంశాలు ఎందుకు ప్రస్తావిస్తున్నారని.. కేవలం మీ భద్రతపైనే వాదించాలని కేఏ పాల్‌కు హైకోర్టు సూచించింది. అనంతరం కేఏ పాల్ భద్రతపై నిర్ణయం తీసుకోవాలని డీజీపీకి ఆదేశించిన హైకోర్టు.. పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
ఇవి కూడా చదవండి :
- డీసీఎం -కారు ఢీ… నలుగురు వ్యక్తుల దుర్మరణం
- నేడు హైదరాబాద్‌కు అమిత్ షా…. బీజేపీ నేతలతో సమావేశం
- ఎన్నెండ్లు ఈ నిరీక్షణ… నిరుద్యోగ భృతి పై ఊసేలేదు..ఇచ్చేది డౌటేనా…??
- ఎమ్మెల్యే రాజసింగ్‌కు తప్పిన ప్రమాదం… రోడ్డు మధ్యలో ఊడిపోయిన కారు టైర్
- మోగిన ఎంఎల్‌సి ఎన్నికల నగారా… రెండు తెలుగు రాష్ట్రాలలో 15 స్థానాలకు ఎన్నిక
One Comment