
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్రీయ దళిత సేన ఫౌండర్ హమారా ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. హమారా ప్రసాద్ అనే వ్యక్తి ఓ వీడియో చేసి యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాల్లో ఫిబ్రవరి 9న పెట్టారు. దీంతో.. ఆ వీడియో కాస్త వైరల్ కావటంతో.. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. రాజ్యాంగం రచించిన అంబేడ్కర్‌ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన.. హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేయాలంటూ ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
Read Also : ఏపీ సీఎం జగన్‌తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ….
కొంతమంది వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు.. ప్రసాద్‌పై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ అల్వాలలోని తన నివాసానికి వెళ్లి హమారా ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు. “అంబేడ్కర్ 12 డిగ్రీలు చదివిన గొప్ప వ్యక్తి, మేధావి. ఒక దేశ రాజ్యాంగాన్ని రాశానని చెప్పుకునే మహా మేధావి.. ఒక నాయకుడనే వాడు.. ప్రజలందరినీ సమానంగా చూడాలి. తనకు నష్టం కలిగినా కూడా.. ఎదుటివాళ్ల మీద తన ద్వేషాన్ని పెంచుకోకూడదు. అందరినీ సమానంగా చూడాలి. వివక్ష చూపంచకూడదు. ఏమైనా లోపాలుంటే వాటిని తొలగించేందుకు కృషి చేయాలి.
Also Read : సీఎం కేసీఆర్ కీలక ప్రకటన…. పోడు భూములకు రైతుబంధు, భూమి లేని వారికి గిరిజనబంధు
అంతే కానీ.. ఒక మతాన్ని, కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ.. అంబేడ్కర్ ఓ పుస్తకం రాశారు. నేను గనక ఆయన ఉన్న రోజుల్లో ఈ పుస్తకం చదివి ఉంటే.. మరో గాడ్సే అయ్యేవాన్ని” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు హమారా ప్రసాద్. అయితే.. నాగులారపు వరప్రసాద్ అనే వ్యక్తి.. హమారా ప్రసాద్ అనే యూట్యూబ్ ఛానల్‌లో అంబేడ్కర్ మీద విశ్లేషణలు చేస్తున్నారు. ఈ విశ్లేషణల్లో అంబేడ్కర్‌కు వ్యతిరేఖంగా కూడా కొన్ని వీడియోలు చేశారు. ఈ క్రమంలో నేను మరో గాడ్సె అయ్యేవాన్ని అంటూ చేసిన వీడియో వైరల్ కావటంతో.. పెద్దఎత్తున్న ఆందోళనలు చేశారు. దీంతో.. పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి :
- ప్రగతిభవన్ వద్ద గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్…
- ఎస్‌ఎస్‌ఎల్‌వి డీ2 ప్రయోగం విజయవంతం… నింగిలోకి మూడు ఉపగ్రహాలు
- కేఏ పాల్ భద్రత తొలగింపుపై డిజిపికి హై కోర్ట్ కీలక ఆదేశాలు…
- డీసీఎం -కారు ఢీ… నలుగురు వ్యక్తుల దుర్మరణం
- కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్… త్వరలోనే అందిస్తామని మంత్రి గంగుల ప్రకటన