
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య మాటల యుద్ధంతో తెలంగాణ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు తెలంగాణ సచివాలయంలో డోమ్ లను కూల్చివేస్తామని.. కొత్తదాన్ని నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కడతామని అన్నారు. తెలంగాణలో నిజాం వారసత్వాన్ని ధ్వంసం చేస్తామని .. నిజాం వారసత్వ బానిస మరకలను సమూలంగా తుడిచివేస్తామన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ …భారతీయ, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయంలో మార్పులు చేస్తాం.
Read Also : హిండెన్ బర్గ్ నివేదికపై కేంద్రానికి సుప్రీంకోర్ట్ డెడ్ లైన్….
ప్రగతి భవన్ ను ప్రజా దర్భార్ లా మారుస్తాం. ఒవైసీ కళ్లల్లో ఆనందం కోసమే సచివాలయాన్ని తాజ్ మహల్ లాంటి సమాధిలా మార్చారు. రోడ్డు కు అడ్డం ఉంటే మసీదులు, మందిరాలు కులుస్తామన్న కేసీఆర్.. దమ్ముంటే పాతబస్తీలోని రోడ్లకు అడ్డంగా ఉన్న మసీదులను కూల్చండి అంటూ సవాల్ విసిరారు. అసెంబ్లీ లో బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి నాటకాలాడుతున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు. కూకట్ పల్లిలో పేదల భూములను కబ్జా చేశారని.. వారి పైన కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు పెడతాం. ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు బీజేపీకే పట్టం కడుతున్నారు. బీఆర్ఎస్ మూర్ఖత్వ పాలనను ప్రజలకు వివరించేందుకు ఈ మీటింగ్ లు పెడుతున్నాం. మోదీ పాలనా విజయాలను వివరిస్తాం. సీఎం కేసీఆర్ ఫార్మ్ హౌస్, ప్రగతి భవన్ కు పరిమితం అయ్యారు. ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు.
Also Read : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మీద హమారా ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు… కేసు నమోదు, అరెస్ట్
ఈ రోజుకి ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాలేదు. రాష్ట్ర ఆదాయంలో 60 శాతం హైదరాబాద్ నుండే వస్తోంది. హైదరాబాద్ ను ఏ మేరకు అభివృద్ధి చేశారో స్పష్టం చేయాలి. దుర్మార్గులు, దుష్టులు ఇద్దరు ఏకమై బీజేపీ కి మేయర్ పదవి రాకుండా చేశారు. మూతపడ్డ ఫైనాన్స్ దుకాణానికి కొత్త పేరు పెట్టి తెరిచినట్లుగా ఉంది బీఆర్ఎస్ వ్యవహారం. కేసీఆర్ ఎక్కడి కి వెళ్ళినా అబద్ధాలు చెబుతున్నారు. మోదీ ప్రభుత్వం రూ.3 కోట్ల ఇళ్లు ఇచ్చింది. కేసీఆర్ ఎంత మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో చెప్పాలి. అన్ని ధరలను పెంచిన కేసీఆర్.. భూములు కబ్జాతో వేల కోట్లు సంపాదిస్తున్నారు. వేల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టి విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి :
- ఏపీ సీఎం జగన్‌తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ….
- సీఎం కేసీఆర్ కీలక ప్రకటన…. పోడు భూములకు రైతుబంధు, భూమి లేని వారికి గిరిజనబంధు
- ప్రగతిభవన్ వద్ద గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్…
- కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్… త్వరలోనే అందిస్తామని మంత్రి గంగుల ప్రకటన
- కేఏ పాల్ భద్రత తొలగింపుపై డిజిపికి హై కోర్ట్ కీలక ఆదేశాలు…
2 Comments