
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో పౌరసరఫరాలు, బీసీ వెల్పేర్ శాఖ మంత్రి గంగుల కమాలాకర్ వెల్లడించారు. అర్హులైన పేదలందరికీ త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకుగాను పేదల ప్రజల నుంచి దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు.. దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి కూడా వివరాలు సేకరించారు. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి ఇప్పటివరకు రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయలేదు. దీంతో చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. రేషన్ కార్డులను జారీ చేయకపోవడం వల్ల చాలామంది లబ్ధిదారులు నష్టపోతున్నారు.
Read Also : నేడు హైదరాబాద్‌కు అమిత్ షా…. బీజేపీ నేతలతో సమావేశం
రేషన్ సరుకులు తీసుకునే అర్హత ఉన్నా కార్డు లేకపోవడం వల్ల తీసుకోలేకకోతున్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్లియర్ చేసి వెంటనే రేషన్ కార్డులను జారీ చేయలని ప్రతిపక్షాలు ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం జాప్యం చేస్తూనే వస్తోంది. ఇప్పుడు త్వరలోనే పేదలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ప్రకటించడంతో.. త్వరలోనే తమకు కార్డులు అందుతాయని దరఖాస్తుదారులు ఆశిస్తున్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం 53 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిందని, తాము అదనంగా 35 లక్షల కార్డులు ఇచ్చినట్లు గంగుల కమలాకర్ తాజాగా అసెంబ్లీలో తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 1.9 కోట్ల మందిని పేదలుగా గుర్తించి కేంద్రం రేషన్ అందిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ రేషన్ కార్డులు 95 లక్షల మందిని కవర్ చేస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి….
- ఎన్నెండ్లు ఈ నిరీక్షణ… నిరుద్యోగ భృతి పై ఊసేలేదు..ఇచ్చేది డౌటేనా…??
- ఎమ్మెల్యే రాజసింగ్‌కు తప్పిన ప్రమాదం… రోడ్డు మధ్యలో ఊడిపోయిన కారు టైర్
- అసెంబ్లీలో ధరణి పోర్టల్ పై వాడీ వెడీ చర్చ… కాంగ్రెస్ ఎంఎల్‌ఏల వాకౌట్….
- మోగిన ఎంఎల్‌సి ఎన్నికల నగారా… రెండు తెలుగు రాష్ట్రాలలో 15 స్థానాలకు ఎన్నిక
4 Comments