
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పోడు భూములకు కూడా రైతుబంధుతో పాటు ఉచిత కరెంట్ ఇస్తామని స్పష్టం చేశారు. ఈ నెలలోనే పోడు భూములను పంపిణీ చేస్తామని, అడవులను కాపాడే బాధ్యత గిరిజన బిడ్డలే తీసుకోవాలని సూచించారు. పోడు భూములు పంపిణీ తర్వాత ఎవరికైనా భూములు రాకపోతే వారికి గిరిజనబంధు ఇస్తామన్నారు.
Read Also : ప్రగతిభవన్ వద్ద గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్…
పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు వాటిని ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. పోడు భూములపై తమకు స్పష్టత ఉందని, సాగు చేసుకునేందుకు భూములను గిరిజనులకు ఇస్తామని తెలిపారు. అడవులను నరికివేయడం సరైనదేనా? పోడు భూముల వివాదానికి ముగింపు పలకాలా? వద్దా? అని ప్రశ్నించారు. మన కళ్ల ముందు అడవులు నాశనమైపోతున్నాయని, రాష్ట్రంలో అటవీ సందప ఉండాలా? వద్దా? అనేదే ఇప్పుడు సమస్య అని చెప్పారు. పోడు, అటవీ భూముల విషయంలో ఇప్పుడు లెక్కలే తేల్చాలని, మొక్కలు నాటడానికి ఎంతో కష్టపడ్డామన్నారు.
Also Read : ఎస్‌ఎస్‌ఎల్‌వి డీ2 ప్రయోగం విజయవంతం… నింగిలోకి మూడు ఉపగ్రహాలు
గిరిజనుల హక్కులను ఖచ్చితంగా కాపాడాల్సిందేనని, పోడు భుములపై సర్వే కూడా పూర్తి చేసి అంతా సిద్దం చేసి పెట్టామన్నారు. ’66 లక్షల ఎకరాల అటవీ భూముల్లో 11.5 లక్షల ఎకరాల పోడు భూములు ఉన్నాయి. ఇకపై అడవులు నరికివేత ఉండదని అంతా ఒప్పుకున్నాకే 11.5 ఎకరాల పోడు భూములు పంపిణీ ఉంటుంది. ఎవరైనా మన బిడ్డలే.. అందరికీ న్యాయం చేస్తాం.. పోడు భూముల సమస్యలపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తాం. ఫిబ్రవరి నుంచే పోడు భూములు పంపిణీ చేపడతాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
- కేఏ పాల్ భద్రత తొలగింపుపై డిజిపికి హై కోర్ట్ కీలక ఆదేశాలు…
- డీసీఎం -కారు ఢీ… నలుగురు వ్యక్తుల దుర్మరణం
- కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్… త్వరలోనే అందిస్తామని మంత్రి గంగుల ప్రకటన
- నేడు హైదరాబాద్‌కు అమిత్ షా…. బీజేపీ నేతలతో సమావేశం
- రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి….
2 Comments