
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అదాని కంపెనీలు సుమారు 10 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ వెల్లడించిందీ రిపోర్ట్. ఈ నివేదిక దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. హిండన్ బర్గ్ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలంటూ ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టుతున్నాయి. పార్లమెంట్ ఉభయ సభలనూ స్తంభింపజేస్తోన్నాయి. ప్రధాని-అదాని భాయ్ భాయ్ అనే నినాదాన్ని లేవనెత్తాయి. వాటిని కేంద్ర ప్రభుత్వం తిప్పికొడుతోందే గానీ జేపీసీతో దర్యాప్తు జరిపించడానికి ససెమిరా అంటోంది.
Read Also : కేఏ పాల్ భద్రత తొలగింపుపై డిజిపికి హై కోర్ట్ కీలక ఆదేశాలు…
ప్రధాని మోదీ స్వయంగా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాం మొత్తం కుంభకోణాలమయం అంటూ ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగారు. ఈ పరిణామాల మధ్య తాజాగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. హిండన్ బర్గ్ నివేదికపై సమగ్ర దర్యాప్తు జరిపించేలా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. సీనియర్ అడ్వొకేట్ విశాల్ తివారీ ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. అత్యవసరంగా దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలను ప్రతివాదులుగా చేర్చారు. హిండన్ బర్గ్ ఇచ్చిన నివేదిక వల్ల అదాని సంస్థల్లో షేర్లను కొనుగోలు చేసిన చిన్న ఇన్వెస్టర్లు దారుణంగా నష్టపోయారని విశాల్ తివారీ చెప్పారు. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఉన్న 10 సంస్థలు కూడా ఘోరంగా నష్టపోయాయని గుర్తు చేశారు. ఏ కారణాలతో ఈ నివేదిక ఇచ్చినా.. అందులోని నిజనిజాలను ఖచ్చితంగా వెలుగులోకి తీసుకుని రావాల్సి అవసరం ఉందని అన్నారు. ఈ నివేదికపై దర్యాప్తు జరిపించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదని, సమగ్ర దర్యాప్తు జరిపించేలా కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : ఎస్‌ఎస్‌ఎల్‌వి డీ2 ప్రయోగం విజయవంతం… నింగిలోకి మూడు ఉపగ్రహాలు
ఈ మధ్యాహ్నం భోజనం విరామం అనంతరం సుప్రీంకోర్టు ఈ పిటీషన్లపై విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని బెంచ్.. కేంద్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. ఈ నెల 13వ తేదీ నాటికి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాను సూచించింది. భవిష్యత్ లో ఇన్వెస్టర్ల సొమ్ముకు ఎలా రక్షణ కల్పిస్తారనేది తెలియజేయాలని పేర్కొంది. ఇప్పుడున్న నిబంధనలు ఎలాంటివనేది వివరించాలని ఆదేశించింది. మున్ముందు ఇలాంటివి సంభవించకుండా రెగ్యులేటరీ మార్గదర్శకాలను మరింత ఎలా బలోపేతం చేస్తారనేది స్పష్టంగా తెలియజేయాలని సుప్రీంకోర్టు సెబిని కోరింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కూడా ఇలాంటి సూచనలనే చేసింది సుప్రీంకోర్టు. ఈ వ్యవహారాన్ని పరిశీలించడానికి ప్రత్యేకంగా ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది.
ఇవి కూడా చదవండి :
- డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మీద హమారా ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు… కేసు నమోదు, అరెస్ట్
- ఏపీ సీఎం జగన్‌తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ….
- సీఎం కేసీఆర్ కీలక ప్రకటన…. పోడు భూములకు రైతుబంధు, భూమి లేని వారికి గిరిజనబంధు
- ప్రగతిభవన్ వద్ద గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్…
- డీసీఎం -కారు ఢీ… నలుగురు వ్యక్తుల దుర్మరణం
One Comment