TelanganaVikarabad

ఎన్నెండ్లు ఈ నిరీక్షణ… నిరుద్యోగ భృతి పై ఊసేలేదు..ఇచ్చేది డౌటేనా…??

క్రైమ్ మిర్రర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : నిరుద్యోగ భృతి హామీని ప్రభుత్వం అటకెక్కినట్టేనా…?ఆ హామిని అమలు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తుందా….?అందుకే ఆ అంశాన్ని తెర మీదకి తెవడం లేదా….? ఈ ప్రశ్నలకు ప్రభుత్వ వర్గాలు అవుననే అంటున్నాయి.ప్రస్తుతం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇస్తుండగా భృతి ఎందుకనే ఎదురు ప్రశ్న సీఎం కేసీఆర్ నుంచి వచ్చినట్టు తెలిసింది.ఇక నుంచి నిరుద్యోగ భృతి గురించి మంత్రులు,ఎమ్మెల్యేలు ఎవరూ కూడా మాట్లాడవద్దని ఆదేశించినట్టు సమాచారం.2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల రూ.3,016 ఇస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది.రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు కావస్తున్నా అడపా దడపా చర్చలు తప్పా ఇంతవరకు ఆ హామీ గురించి ప్రభుత్వంలో కదలిక లేదు. ”ఆ హామీని అమలు చేయడం కష్టం. దాన్ని సీఎం కేసీఆర్ పక్కన పెట్టిసిండు. దాదాపుగా అది కోల్ట్ స్టోరేజీలోకి వెళ్లనట్టే” అని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు.

vikarabad 1 2 - Crime Mirror

Read Also : అసెంబ్లీలో ధరణి పోర్టల్ పై వాడీ వెడీ చర్చ… కాంగ్రెస్ ఎం‌ఎల్‌ఏల వాకౌట్….

20 లక్షల మందికి మొండిచెయ్యి…!!

రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి.వీరంతా డిగ్రీ పాసై, 30 ఏండ్ల వయోపరమితిలోపు ఉన్న వారే. ఒకవేళ ప్రభుత్వం నిరుద్యోగ భృతి అమలు చేస్తే వీరందరికీ ప్రతి నెల రూ,3,016 అందేవి. కానీ ప్రభుత్వం ఇంతవరకు ఆ హామీ అమలుపై చొరవ చూపకపోవడంతో 20 లక్షల మంది నిరాశలో ఉన్నారు. ఎన్నికల హామీని అమలు చేయాలని కాంగ్రెస్,బీజేపీతోపాటు ఇతర విపక్షాలు,విద్యార్థి సంఘాలు పలుమార్లు డిమాండ్ చేసినా ఫలితం లేకుండా పోయింది.కాంగ్రెస్‌కు పోటీగా మేనిఫెస్టోలో చేరిన హామీ
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించింది.అలాగే నిరుద్యోగులకు నెలకు రూ.3000 చొప్పున భృతి ఇస్తామని పేర్కొంది.

Read Also : ఎమ్మెల్యే రాజసింగ్‌కు తప్పిన ప్రమాదం… రోడ్డు మధ్యలో ఊడిపోయిన కారు టైర్

కాంగ్రెస్ ఎన్నికల హామీని చూసిన కేసీఆర్ ఆందోళన చెందినట్టు తెలిసింది.నిరుద్యోగులు కాంగ్రెస్‌కు ఓటు వేస్తారని భయంతో అప్పటికప్పుడు మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతిని చేర్చాలని ఆదేశించినట్టు సమాచారం.దీంతో ఎన్నికల ప్రణాళికను తయారు చేస్తోన్న కేకే నేతృత్వంలోని నిరుద్యోగులకు ప్రతి నెల రూ.3016 ఇస్తామని మేనిఫెస్టోలో చేర్చినట్టు పార్టీ లీడర్లు ఇప్పటికి గుర్తు చేస్తుంటారు.కేటాయింపులే తప్పా పైసా ఖర్చు చెయ్యలే నిరుద్యోగ భృతి కోసం ప్రభుత్వం ప్రతి బడ్జెట్‌లో నిధులను కేటాయించి ఖర్చు చేయకుండా చేతులు దులుపుకుంది.అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2019–20లో రూ.1810 కోట్లు కేటాయించి,ఒక్క పైసా కూడా ఖర్చు చేయ్యలేదు.2020–21లో కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదని సాకుతో నిరుద్యోగ భృతికి కేటాయించలేదు.కాని 2020–21లో రూ.8,500 కోట్లను బడ్జెట్ కేటాయించిదే తప్పా నిరుద్యోగులకు భృతి ఇవ్వలేదు. 2022–23 అలాగే 2023-24లో అసలు నిరుద్యోగ భృతి ఊసే లేకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టారు.దీంతో బీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టో నుంచి నిరుద్యోగ భృతిని పక్కన పెట్టేసిందనే చర్చ అప్పట్లోనే జరిగింది.

vikarabad 3 2 - Crime Mirror

Also Read : మోగిన ఎం‌ఎల్‌సి ఎన్నికల నగారా… రెండు తెలుగు రాష్ట్రాలలో 15 స్థానాలకు ఎన్నిక

ఉద్యోగాలిస్తున్నాం.. భృతి ఎందుకు?

ప్రభుత్వంలోని వివిధ శాఖాల్లో ఖాళీగా ఉన్న సుమారు 80 వేల ఖాళీలను భర్తీ చేసేందుకు కేబినెట్ ఆమోదించింది. అందులో కొన్నింటికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంకొన్ని రాత పరీక్షల దశల్లో ఉన్నాయి. మిగతా నోటిఫికేషన్లు ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి ఉంది. అయితే ఉద్యోగాల భర్తీ చేస్తుండగా మళ్లీ నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం లేదని, ఈ మధ్య జరిగిన ఓ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో కేసీఆర్ కామెంట్ చేసినట్టు తెలిసింది. దీంతో ఇక ఆ ఎన్నికల హామీని మరిచిపోవాల్సిందేనని సెక్రటేరియట్ వర్గాలు అంటున్నాయి.

ఇవి కూడా చదవండి : 

  1. బడిలో పాము కాటుకు గురై ఆరేళ్ల చిన్నారి మృతి….
  2. ఇక నుంచి ఫిబ్రవరి 14న “కౌ హగ్ డే”
  3. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ దూకుడు.. నిన్న ఇద్దరు, తాజాగా మరొకరి అరెస్ట్
  4. భార్య మృతి కేసులో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అరెస్ట్… వరకట్న వేధింపులు కేసు నమోదు
  5. 40 రోజులుగా కనిపించని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్…

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.