Telangana

అసెంబ్లీలో ధరణి పోర్టల్ పై వాడీ వెడీ చర్చ… కాంగ్రెస్ ఎం‌ఎల్‌ఏల వాకౌట్….

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ధరణి పోర్టల్‌పై శాసనసభలో ఇవాళ వాడీవేడీ చర్చ జరిగింది. ఈ పోర్టల్ రైతలకు శాపంగా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ధరణి పోర్టల్ మెుత్తం తప్పుల తడక అని.., అందులో ఉన్న లోపాలను పరిష్కరించాలని సభా వేదికగా ఆయన డిమాండ్ చేశారు. తమ భూములు కనిపించక ఈ ఏడాదే నాలుగు రైతులు మృతి చెందారన్నారు. ఇన్నాళ్లు ఆందోళనలు, ఆత్మహత్యల వరకే ఆగేవిని.. ఇప్పుడు హత్యలు, ఘర్షణలకు దారి తీస్తున్నాయన్నారు. భూములు అమ్మిన పాత వ్యక్తుల పేరు మీద కొత్త పాసు పుస్తకాలు వస్తున్నాయన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఆ డేటాను తహసీల్దార్లు కూడా పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపించారు. ధరణిలో తీసుకున్న గ్రీవెన్స్‌లు దాదాపు 5 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

Read Also : మోగిన ఎం‌ఎల్‌సి ఎన్నికల నగారా… రెండు తెలుగు రాష్ట్రాలలో 15 స్థానాలకు ఎన్నిక

కొందరి ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. రైతులు గందరగోళంలో ఉన్నారని.. ధరణి పోర్టల్ రద్దు చేయటమే తమ నినాదమని శ్రీధర్ బాబు అన్నారు. శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ప్రతిపక్షాలు ప్రతీది భూతద్దంలో పెట్టి చూస్తోందని మండిపడ్డారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేయటమే కాంగ్రెస్ విధానామా ? అని ప్రశ్నించారు. అంత చక్కగా జరగుతున్న వ్యవస్థలో లోపాలు వెతకటం సరికాదన్నారు. ఏకపక్షంగా ధరణి సరైన విధానం కాదని అన్నారు. ధరణి పోర్టల్‌పై.. మీరు చేస్తున్న ఆరోపణలు నిరూపించగలరా అని శ్రీధర్ బాబును ప్రశ్నించారు. సత్య దూరమైన మాటలు మాట్లాడవద్దని కేటీఆర్ సూచించారు. మీరు చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే క్షమాపణ చెబుతారా ? అని కేటీఆర్ నిలదీశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. ప్రగతి భవన్ పేల్చేయాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడుతాడని.., అసలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న వైఖరేంటని మండిపడ్డారు.

Also Read : బడిలో పాము కాటుకు గురై ఆరేళ్ల చిన్నారి మృతి….

ఇంత అరాచకం ఉంటుందా ? అని కేటీఆర్ ఆక్షేపించారు. రైతులకు 24 గంటల విద్యుత్ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. ఇచ్చే కరెంట్‌ కూడా ఏ సమయంలో ఇస్తున్నారో సరిగ్గా చెప్పటం లేదన్నారు. ఈ విషయాన్ని సభలో స్పీకర్‌కు విన్నవించినప్పటికీ.. కాంగ్రెస్ సభ్యులను పట్టించుకోవటం లేదన్నారు. ప్రజా సమస్యలపై సభలో చర్చించడానికి ప్రభుత్వం ముందుకురాని పరిస్థితిలో ఉందని ఆక్షేపించారు. అందుకే శాసనసభ నుంచి బయటకు వచ్చి నిరసన తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. కరెంట్ కోతలపై చర్చించి పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. తమ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై సభలో చర్చించకపోవడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యనించారు. కరెంట్ కోతలతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. ఇక నుంచి ఫిబ్రవరి 14న “కౌ హగ్ డే”
  2. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ దూకుడు.. నిన్న ఇద్దరు, తాజాగా మరొకరి అరెస్ట్
  3. భార్య మృతి కేసులో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అరెస్ట్… వరకట్న వేధింపులు కేసు నమోదు
  4. జగన్ ప్రజా వేదికను కూల్చినట్లు.. ప్రగతి భవన్ ను రేవంత్ కూల్చేస్తాడా?
  5. రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చెయ్యాలి… కేఏ పాల్ సంచలన వ్యాక్యలు

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.