
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం 15 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ఈసీ రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 16న ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇక ఈసీ రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 13న పోలింగ్, మార్చి 16న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఏపీలో 3 పట్టభద్రుల స్థానాలు, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, 8 స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తెలంగాణలో ఒక స్థానిక సంస్థకు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈసీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రకాశం -నెల్లూరు- చిత్తూరు నియోజకవర్గంతో పాటుగా కడప- అనంతపురం- కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గానికి షెడ్యూల్ విడుదల అయింది.
Read Also : బడిలో పాము కాటుకు గురై ఆరేళ్ల చిన్నారి మృతి….
ఈ రెండు స్థానాల్లో ప్రస్తుతం సభ్యులుగా ఉన్న బాలసుబ్రమణ్యం..కత్తి నరసింహా రెడ్డి మార్చి 29న పదవీ విరమణ చేయనున్నారు. అదే విధంగా మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేసారు. ప్రకాశం- నెల్లూరు -చిత్తూరు ప్రస్తుత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాసుల రెడ్డి మార్చి 29న రిటైర్ కానున్నారు. కడప- అనంతపురం- కర్నూలు ప్రస్తుత ఎమ్మెల్సీ గోపాలరెడ్డి కూడా అదే రోజున పదవీ విరమణ చేయనున్నారు. శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ నేత మాధవ్ కూడా అదే రోజున పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన తిరిగి ఎన్నికల్లో పోటీలో నిలుస్తున్నారు. వీటితో పాటుగా తొమ్మది స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ తొమ్మది సీట్లు టీడీపీ నేతలకు చెందినవే. ఈ తొమ్మది స్థానాల్లోని ప్రస్తుత సభ్యుల్లో ఇద్దరు మార్చి 29, మరో ఏడుగురు మే 1వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు.
Also Read : ఇక నుంచి ఫిబ్రవరి 14న “కౌ హగ్ డే”
స్థానిక సంస్థల కోటాలో అనంతపురం నుంచి దీపక్ రెడ్డి, కడప నుంచి బీ టెక్ రవి స్థానాల్లో ఎన్నిక జరగనుంది. నెల్లూరు నుంచి వాకాటి నారాయణ రెడ్డి, పశ్చిమ గోదావరి నుంచి అంగర రామ్మోహన్ రావు, మంతెన వెంకట సత్యనారాయణ రాజు, తూర్పు గోదావరి నుంచి చిక్కాల రామచంద్రరావు, శ్రీకాకుళం నుంచి శత్రుచర్ల విజయరామ రాజు, చిత్తూరు నుంచి రాజనర్సింహులు, కర్నూలు నుంచి కేఈ ప్రభాకర్ అదే రోజు రిటైర్ కానున్నారు. ఈ స్థానాలకు మార్చి 13న పోలింగ్ జరగనుంది. ఇవన్నీ వైసీపీ ఖాతాలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇక తెలంగాణలో హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్ అయింది. హైదరాబాద్ లో స్థానిక సంస్థల ఎన్నిక జరగనుంది.
ఇవి కూడా చదవండి :
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ దూకుడు.. నిన్న ఇద్దరు, తాజాగా మరొకరి అరెస్ట్
- భార్య మృతి కేసులో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అరెస్ట్… వరకట్న వేధింపులు కేసు నమోదు
- భూకంపానికి టర్కీ అతలాకుతలం… తెలుగు రాష్ట్రాలకు గండం ఉందా?
- జగన్ ప్రజా వేదికను కూల్చినట్లు.. ప్రగతి భవన్ ను రేవంత్ కూల్చేస్తాడా?
- రేవంత్ రెడ్డి వ్యాక్యలపై బిఆర్‌ఎస్ నేతల సీరియస్…. పాదయాత్ర అడ్డుకుంటామని వార్నింగ్
One Comment