
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తోన్న టీపీసీసీ రేవంత్ రెడ్డి ప్రగతిభవన్ మీద చేసిన వ్యాఖ్యలు సర్వత్రా దుమారం రేపుతున్నాయి. కాగా.. రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు సమర్థిస్తుండగా… మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు. ఇంకొందరు పెద్దరు తటస్థంగా ఉన్నారు. అయితే.. ఇదే నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నల్గొండ ఏంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ప్రగతి భవన్‌ను నక్సల్స్ బాంబు పెట్టి పేల్చాయని రేవంత్ రెడ్డి అనకుండా ఉండాల్సిందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ అనేది కేవలం కేసీఆర్ సొత్తు కాదని.. అది ప్రజల ఆస్తి అని వెంకట్ రెడ్డి అన్నారు. అయితే.. ప్రగతి భవన్‌ను ప్రజా దర్బార్‌గా వినియోగించాలనో.. ఆస్పత్రిగా వాడుకోవాలనో రేవంత్ అంటే బాగుండేదన్నారు వెంకట్ రెడ్డి.
Read Also : ఎన్నెండ్లు ఈ నిరీక్షణ… నిరుద్యోగ భృతి పై ఊసేలేదు..ఇచ్చేది డౌటేనా…??
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ములుగులో పర్యటించిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ సర్కార్ మీద నిప్పులు చెరిగారు. ఈ క్రమంలోనే ప్రగతి భవన్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దొరల కాలంలో గడీలను గ్రానైట్లు పెట్టి పేల్చేసినట్టు.. ప్రస్తుతం గడీని తలపిస్తోన్న ప్రగతి భవన్‌ను కూడా నక్సల్స్ బాంబులు పెట్టి పేల్చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యలు చేసినందుకు గానూ.. రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులు కూడా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అభిప్రాయాన్ని బహిరంగంగా పంచుకోవటం మరోసారి.. కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : ఎమ్మెల్యే రాజసింగ్‌కు తప్పిన ప్రమాదం… రోడ్డు మధ్యలో ఊడిపోయిన కారు టైర్
కాగా.. రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందు నుంచి వ్యతిరేఖిస్తూ వస్తున్నారు. ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన రోజు నుంచి పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్టుగా ఉంటున్న కోమటిరెడ్డి.. బహిరంగంగానే అక్కస్సు వెళ్లగక్కిన సందర్భాలూ ఉన్నాయి. అయితే.. వీళ్లిద్దరి మధ్య తలెత్తిని వివాదాలు.. పార్టీలో పెద్ద దుమారమే రేపింది. ఇదిలా ఉంటే.. ఇటీవల గాంధీ భవన్‌లో జరిగిన హాత్ సే హాత్ జోడో యాత్ర సన్నాహక మీటింగ్‌లో వీళ్లిద్దరూ కలసి భేటీ కావటం ఆసక్తికరంగా మారింది. హాత్ సే హాత్ జోడో యాత్రలో తాను కూడా పాల్గొంటానని.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని చెప్పటం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
- అసెంబ్లీలో ధరణి పోర్టల్ పై వాడీ వెడీ చర్చ… కాంగ్రెస్ ఎంఎల్‌ఏల వాకౌట్….
- మోగిన ఎంఎల్‌సి ఎన్నికల నగారా… రెండు తెలుగు రాష్ట్రాలలో 15 స్థానాలకు ఎన్నిక
- బడిలో పాము కాటుకు గురై ఆరేళ్ల చిన్నారి మృతి….
- ఇక నుంచి ఫిబ్రవరి 14న “కౌ హగ్ డే”
- 40 రోజులుగా కనిపించని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్…
2 Comments