
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. వరకట్న వేధింపులు, సెక్షన్ 306 కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. రెండ్రోజుల క్రితం బాలకృష్ణ భార్య జ్యోతి ఇంట్లో అనుమానస్పద స్థితిలో ఉరేసుకొని చనిపోగా.. ఆమె మృతికి బాలకృష్ణే కారణమని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం బాలకృష్ణ స్వస్థలం. 2012లో బాలకృష్ణ కానిస్టేబుల్‌గా ఎంపిక కాగా.. కొనిజర్ల మండలం సీతారామపురం గ్రామానికి చెందిన జ్యోతితో 2014లో వివాహమైంది.
Read Also : భూకంపానికి టర్కీ అతలాకుతలం… తెలుగు రాష్ట్రాలకు గండం ఉందా?
వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూనే 2020లో గ్రూప్ -2 పరీక్ష రాసి మున్సిపల్ కమిషనర్‌గా ఎంపికయ్యాడు. నిర్మల్ మున్సిపల్ కమిషనర్‌గా మెుదటి పోస్టింగ్ పొందగా.. ఎడాదిన్నర క్రితం మంచిర్యాలకు బదిలీ అయ్యారు. అయితే.. బాలకృష్ణ మున్సిపల్ కమిషనర్‌గా ఎంపికైన నాటి నుంచి జ్యోతిని వేధింపులకు గురి చేసేవాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అతనితో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమ కూతుర్ని సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురి చేసేవారని చెబుతున్నారు. తాను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కోట్లలో కట్నం వచ్చేదని.. అందమైన భార్య దొరికేదని పదేపదే బాలకృష్ణ మాటలతో హింసించేవాడని చెప్పారు. బయటికి చూడడానికి మంచివాడిగా నటిస్తూ… ఇంట్లో భార్యపై సైకోలాగా, శాడిస్టులాగా ప్రవర్తించేవాడని వారు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Also Read : జగన్ ప్రజా వేదికను కూల్చినట్లు.. ప్రగతి భవన్ ను రేవంత్ కూల్చేస్తాడా?
మంగళవారం జ్యోతి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయింది. పిల్లలు స్కూల్‌కు వెళ్లాక ఆమె అఘాయిత్యానికి పాల్పడింది. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు తల్లి ఉరితాడుకు వేలాడుతుండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే ఇరుగుపొరుగు వాళ్లకు విషయం చెప్పారు. అయితే..తనను బాలకృష్ణ చంపోబోతున్నట్లు జ్యోతి తమకు మంగళవారం ఉదయమే ఫోన్ చేసి చెప్పిందని ఆమె తల్లిదండ్రులు రాంబాబు, రవీంద్ర కుమారి వెల్లడించారు. ఏడుస్తూ తమ కూతురు ఆవేదన వ్యక్తం చేసిందని.. తాము ఫోన్‌లో ఓదార్చామని అంతలోనే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిందని కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇవి కూడా చదవండి :
- వచ్చే వారం మాల్దీవుల్లో ప్రభాస్, కృతి సనన్ ఎంగేజ్ మెంట్..???
- రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చెయ్యాలి… కేఏ పాల్ సంచలన వ్యాక్యలు
- ఎంఎల్‌ఏల ఎర కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ లో ఎదురుదెబ్బ…
- అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలకు గది కేటాయించకపోవటంపై మండిపడ్డ ఈటల…
- హైద్రాబాద్ పాతబస్తీలో దారుణం… మద్యం తాగించి బాలికపై సామూహిక అత్యాచారం
One Comment