
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు రన్నింగ్‌లో ఊడిపోయింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తుండగా.. దూల్‌పేట్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు కారు టైరు ఊడిపోయింది. కారు స్పీడ్ తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది. తన భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ఆడియో విడుదల చేశారు. “బండి డ్యామేజ్ ఉంది.. పాత బండి.. ప్రాబ్లమ్ వస్తుందని అనేక సార్లు చెప్పిన. ఎన్నోసార్లు బండి చెడిపోయింది అయినా ఛేంజ్ చేయలే.
Read Also : అసెంబ్లీలో ధరణి పోర్టల్ పై వాడీ వెడీ చర్చ… కాంగ్రెస్ ఎంఎల్‌ఏల వాకౌట్….
ఇవాళ అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తుంటే ప్రమాదం జరిగింది. మెళ్లిగా వచ్చినా కానీ ప్రమాదం జరిగింది. బండి స్పీడ్‌గా ఉండి ఉంటే పెద్ద యాక్సిడెంట్ అయ్యుండేది. ఓఆర్ఆర్ లాంటి రోడ్డు మీద బండి ఉంటే పెద్ద యాక్సిడెంట్ అయ్యేది. దేవుడి ఆశీర్వాదం వల్ల ప్రమాదం తప్పింది. ఇప్పటికైనా బండి ఛేంజ్ చేయండి. లేకపోతే మీ బండి మీరు తీసుకోండి. అవసరం లేదు.” అని రాజాసింగ్ ఆడియో విడుదల చేశారు. అయితే గతంలోనూ ఆయన కారు పలుమార్లు మెరాయించింది. ఇటీవల రోడ్డు మధ్యలో కారు ఆగిపోగా..ఆయన మరో కారులో ఇంటికి చేరుకున్నారు. తనకు వెహికల్ మార్చాలని గత కొంత కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- మోగిన ఎంఎల్‌సి ఎన్నికల నగారా… రెండు తెలుగు రాష్ట్రాలలో 15 స్థానాలకు ఎన్నిక
- బడిలో పాము కాటుకు గురై ఆరేళ్ల చిన్నారి మృతి….
- ఇక నుంచి ఫిబ్రవరి 14న “కౌ హగ్ డే”
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ దూకుడు.. నిన్న ఇద్దరు, తాజాగా మరొకరి అరెస్ట్
- భార్య మృతి కేసులో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అరెస్ట్… వరకట్న వేధింపులు కేసు నమోదు