
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ దూకుడు పెంచాయి. ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ పలువురు నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. నిన్న (బుధవారం) ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వద్ద మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ (CA)గా పని చేసిన బుచ్చిబాబను సీబీఐ అరెస్టు చేసింది. ఆయన్ను అరెస్టు చేసిన కొన్ని గంటల్లోనే గౌతమ్ మల్హోత్రాను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీకి చెందిన బ్రికంక్ కో సేల్స్ సంస్థకు ఆయన డైరెక్టర్‌గా ఉన్నారు. ఢిల్లీ ఆప్ నేతలతో మల్హోత్రాకు పరిచయాలు ఉన్నాయని, వారి అండతోనే ఈ లిక్కర్ బిజినెస్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. తాజాగా.. మరొకరిని ఈడీ అరెస్ట్ చేసింది. చారియట్ మీడియా అధినేత రాజేష్ జోషీని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also : భార్య మృతి కేసులో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అరెస్ట్… వరకట్న వేధింపులు కేసు నమోదు
ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులతో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు రాజకీయ, వ్యాపారుల పేర్లను చేర్చిన ఈడీ.. ఇటీవల ఫైల్ చేసిన ఛార్జ్‌షీట్‌లో మరికొందరి పేర్లను చేర్చింది. మెుత్తం 17 మందిపై అభియోగాలు నమోదు చేసింది. ఈ సారి ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ఛార్జ్‌షీట్‌లో నమోదు చేయటం ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండో చార్జీషీట్‌లో ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును ప్రస్తావించారు. ఆయనతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా, విజయ్ నాయర్, శరత్ చంద్రా, బినోయ్ బాబు సహా మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపుతూ ఈనెల 2న ఛార్జ్‌షీట్ ఫైల్ చేసింది. ఎక్సైజ్ పాలసీ రూపొందించే సమయంలో అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన విజయ్ నాయర్‌తో మాట్లాడినట్లు ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది.
Also Read : భూకంపానికి టర్కీ అతలాకుతలం… తెలుగు రాష్ట్రాలకు గండం ఉందా?
మెుత్తం 428 పేజీలతో కూడిన రెండో చార్జీషీట్‌ను ఈడీ ఇటీవల విడుదల చేసింది. ఈడీ రెండో ఛార్జ్‌షీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించటం, తాజాగా.. ఆమె మాజీ సీఏ బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేయంటో బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. . మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50(2), (3) కింద బుచ్చిబాబు నుంచి ఇప్పటికే సమాచారం తీసుకున్నామని ఈడీ గత నెలలో దాఖలు చేసిన చార్జిషీట్‌లో వెల్లడించింది. 2022 అక్టోబర్ 8, నవంబర్ 20 తేదీల్లో ఆయన్నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నట్లు చెప్పింది. తాజాగా.. బుచ్చిబాబు అరెస్ట్‌తో కవితకు కూడా ఇబ్బందులు తప్పేలా లేవని ప్రచారం జరుగుతోంది. కవితకు అత్యంత సన్నిహితుడిగా బుచ్చిబాబు ఉన్నారనే టాక్ ఉంది. ఇప్పటికే కవితను ఈ స్కాంలో సీబీఐ ప్రశ్నించింది. ఈ సమయంలో బుచ్చిబాబు అరెస్ట్ బీఆర్ఎస్ వర్గాలకు టెన్షన్ పుట్టిస్తోంది.
ఇవి కూడా చదవండి :
- జగన్ ప్రజా వేదికను కూల్చినట్లు.. ప్రగతి భవన్ ను రేవంత్ కూల్చేస్తాడా?
- వచ్చే వారం మాల్దీవుల్లో ప్రభాస్, కృతి సనన్ ఎంగేజ్ మెంట్..???
- రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చెయ్యాలి… కేఏ పాల్ సంచలన వ్యాక్యలు
- ఎంఎల్‌ఏల ఎర కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ లో ఎదురుదెబ్బ…
- అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలకు గది కేటాయించకపోవటంపై మండిపడ్డ ఈటల…
One Comment