
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అధికార భారత్ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు శాసన సభ్యుల కొనుగోలు కేసు విచారణ ఇక మరింత ముమ్మరం కానుంది. ఇది సీబీఐ చేతికి వెళ్లడం ఖాయమైంది. ఈ కేసుపై విచారణ చేపట్టడానికి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది గానీ.. ఇప్పుడు దీని నుంచి తప్పుకోవాల్సి వస్తోంది ఈ కేసులో సీబీఐ అడుగు పెట్టబోతోంది. బీఆర్ఎస్‌కు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ శాసన సభ్యుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిని పార్టీ ఫిరాయించేలా ప్రలోభ పెట్టటానికి ప్రయత్నించినట్టుగా బీజేపీ నాయకులు ఆరోపణలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సారథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటు చేసింది.
Read Also : అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలకు గది కేటాయించకపోవటంపై మండిపడ్డ ఈటల…
అదే సమయంలో- సిట్ అధికారులు తమను వేధిస్తోన్నారంటూ ఆరోపితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన సింగిల్ జడ్జి వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి బదలాయించింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సీబీఐ పని చేస్తోన్నందున బీజేపీ నాయకులు తమకు అనుకూలంగా కేసును మార్చుకుంటారని ఆందోళన వ్యక్తం చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ అప్పీల్ పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఇవ్వాళ ఆదేశాలను జారీ చేసింది. సింగిల్ బెంచ్ జడ్జి జారీ చేసిన ఆదేశాలను సమర్థించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ను మెయింటెనబిలిటీ కారణంగా కొట్టివేసింది.
Also Read : హైద్రాబాద్ పాతబస్తీలో దారుణం… మద్యం తాగించి బాలికపై సామూహిక అత్యాచారం
స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఇదే అంశంపై తెలంగాణ ప్రభుత్వానికి తాజాగా సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ లూథ్రా ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసు దర్యాప్తు సిట్ నుంచి తప్పించి- సీబీఐకి బదలాయిండం సరికాదని, దీనిపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాళని విజ్ఞప్తి చేశారు. ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు ఇవ్వాళ విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జిస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని బెంచ్ వాదోపవాదాలను ఆలకించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడానికి లేదా యధాతథ స్థితిని కొనసాగించడానికి నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. 13వ తేదీ నాటికి లిస్టింగ్ చేయాలంటూ సిద్ధార్థ్ లూథ్రా చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించలేదు.
ఇవి కూడా చదవండి :
- రేవంత్ రెడ్డి వ్యాక్యలపై బిఆర్‌ఎస్ నేతల సీరియస్…. పాదయాత్ర అడ్డుకుంటామని వార్నింగ్
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం… అత్తారింట్లో అల్లుడి దారుణ హత్య
- హైదరాబాద్ విచ్చేసిన డబుల్ డెక్కర్ బస్సులు… రోడ్లపై పరుగులు పెట్టనున్న బస్సులు
- యదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి… మంత్రి కేటిఆర్
- “కొత్త సీసాలో పాత సార పోసినట్లు”… తెలంగాణ బడ్జెట్‌పై వైఎస్ షర్మిల సెటైర్
One Comment