
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ శాసనసభ ఆవరణలో వసతుల కల్పనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ సభ్యులకు వసతి కల్పించట్లేదని సభలో ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలకు గది కేటాయించకపోవటంపై మండిపడ్డ ఈటల.. తమ పార్టీ సభ్యులు టిఫిన్ చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందన్నారు. తాము కార్లలో కూర్చుని టిఫిన్ చేస్తున్నామని.., ప్రభుత్వం ఇలా వ్యవహరించటం ఎమ్మెల్యేలను అవమానించటమేనని ఈటల వ్యాఖ్యనించారు. “బీజేపీ సభ్యలకు అసెంబ్లీలో వసతులు కల్పించట్లేదు. తమ సభ్యులు టిఫిన్ చేసేందుకు కూడా అవకాశం లేదు. కార్లలో కూర్చుని భోజనాలు చేస్తు్న్నాం. ముగ్గురు ఎమ్మెల్యేలం ఉన్నాం కానీ మాకు ఆఫీస్ ఇవ్వడం లేదు.
Read Also : హైద్రాబాద్ పాతబస్తీలో దారుణం… మద్యం తాగించి బాలికపై సామూహిక అత్యాచారం
కనీసం వాష్ రూమ్స్‌కు వెళ్లేందుకు కూడా మాకు అవకాశం లేదు. ఇంత అవమానమా ?. ఈ విషయంపై స్పీకర్‌ను అర డజను సార్లు కలిశాం. ఏదైనా విషయం గురించి మా సభ్యులు కూర్చుని మాట్లాడేందుకు ఒక రూం ఇయ్యరా. అసెంబ్లీలో బీజేపీ సభ్యులకు ఆఫీస్ కేటాయించాలి. గతంలో లోక్ సత్తా పార్టీ సభ్యుడిగా జేపీ ఉన్నప్పుడు కూడా ఆయనకు రూం కేటాయించారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) మీటింగ్‌కు కూడా మా ఎమ్మెల్యేలను పిలవటం లేదు. గతంలో సీపీఎం, సీపీఐ పార్టీల నుంచి ఒక్కో సభ్యులు ఉన్నప్పటికీ బీఏసీకి వారిని పిలిచారు. ఇది అన్యాయం కాదా ?’ అంటూ ఈటల సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈటల మాట్లాడుతుండగా మధ్యలో కలుగుజేసుకున్న మంత్రి హరీశ్ రావు.. ఐదుగురు సభ్యులు ఉంటేనే ఆఫీస్ ఇచ్చే సంప్రదాయం ఉందని ఆ విషయం సీనియర్ సభ్యులుగా మీకు తెలియదా అని ఈటలను ప్రశ్నించారు.
Also Read : రేవంత్ రెడ్డి వ్యాక్యలపై బిఆర్‌ఎస్ నేతల సీరియస్…. పాదయాత్ర అడ్డుకుంటామని వార్నింగ్
సౌకర్యాల గురించి ప్రస్తావించే వేదిక ఇది కాదన్నారు. బడ్జెట్‌పై చర్చ జరగుతున్న సమయంలో బడ్జెట్‌పై మాత్రామే మాట్లాడాలని.., సీనియర్ సభ్యుడిగా విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని అన్నారు. దీంతో బడ్జెట్‌పై మాట్లాడిన ఈటల జీఎస్‌డీపీలో 25 శాతానికి మంచి అప్పులు చేయకూడదని.., తెలంగాణ ప్రభుత్వం మాత్రం 35 శాతం అప్పులు చేసిందని అన్నారు. బీసీల కోసం బడ్జెట్‌లో పెట్టిన నిధులు విడుదల చేయటం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 5 లక్షల కోట్లు అప్పు చేసిందని అన్నారు. కేంద్రం మద్దతు ధరల కోసం రాష్ట్రంలో 95 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ పూర్తి చేయటంతో పాటు మద్యాహ్న భోజన కార్మికులకు ప్రతి నెలా బిల్లులు చెల్లించాలని ఈటల డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం… అత్తారింట్లో అల్లుడి దారుణ హత్య
- హైదరాబాద్ విచ్చేసిన డబుల్ డెక్కర్ బస్సులు… రోడ్లపై పరుగులు పెట్టనున్న బస్సులు
- కేసీఆర్ ను వణికిస్తున్న ఒవైసీ బ్రదర్స్… ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేస్తే ఏం జరుగుతుంది?
- ప్రతిపక్షపార్టీల కార్యకర్తలు సంక్షేమ పథకాలు తీసుకోవద్దు…. మిర్యాలగూడ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు
- ఖమ్మం జిల్లాపై బీఆర్ఎస్ ఫోకస్… ఈ నెలలో పర్యటించనున్న కేటీఆర్, హరీష్
One Comment