
క్రైమ్ మిర్రర్, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అత్తగారింట్లో అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లాలోని చందుర్తి మండలంలోని నర్సింగపూర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యపై బాధితుడి తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భార్యభర్తల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. తరచూ ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. అయితే గత మూడు రోజుల క్రితం భర్తతో గొడవపడిన భార్య.. రుద్రంగి నుండి నర్సింగపూర్‌లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇద్దరికి నచ్చచెబుదామని నిన్న అల్లుడుని భార్య తరపు కుటుంబసభ్యులు తమ ఇంటికి పిలుపించుకున్నారు.
Read Also : హైదరాబాద్ విచ్చేసిన డబుల్ డెక్కర్ బస్సులు… రోడ్లపై పరుగులు పెట్టనున్న బస్సులు
ఈ క్రమంలో అల్లుడు హత్యకు గురి కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అల్లుడిని ఇంటికి పిలిపించుకుని రాత్రి భార్య, అత్తమామలు కలిసి హత్య చేసి ఉంటారని గణేష్ బంధువులు ఆరోపిస్తున్నారు. గణేష్‌ను తలపై రాడ్‌తో కొట్టి చంపి హత్య చేసినట్లు బంధువులు అనుమానిస్తున్నారు. బంధువుల ఫిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గణేష్ భార్య, బామ్మర్ది, అత్తమామలు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు గుర్తించారు. వారి నలుగురిని పట్టుకుని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. గణేష్ హత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలని కుటుసంభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- కేసీఆర్ ను వణికిస్తున్న ఒవైసీ బ్రదర్స్… ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేస్తే ఏం జరుగుతుంది?
- అమెరికాలో గన్ మిస్ ఫైర్.. తెలంగాణ విద్యార్థి మృతి… ఈ ఘటనలో ట్విస్ట్
- యదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి… మంత్రి కేటిఆర్ –
- ప్రతిపక్షపార్టీల కార్యకర్తలు సంక్షేమ పథకాలు తీసుకోవద్దు…. మిర్యాలగూడ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు
- రసవత్తరంగా ఖమ్మం జిల్లా రాజకీయం… పొంగులేటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన తాత మధు
One Comment