
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ కూల్చేయాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యలపై పెను దుమారమే రేగుతోంది. ఆయన వ్యాఖ్యలపై మండిపడుతున్న బీఆర్ఎస్ నేతలు.. ములుగు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విద్వేషాలు రెచ్చగొడుతున్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై తాజాగా.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం స్పందించారు. ప్రగతి భవన్‌ను పేల్చేయాలన్న రేవంత్ రెడ్డిపై తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. భూ కబ్జాలు చేసి రేవంత్ ఈ స్థాయికి వచ్చారని.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు. రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలంటూ పాల్ సంచనల వ్యాఖ్యలు చేశారు.
Read Also : ఎంఎల్‌ఏల ఎర కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ లో ఎదురుదెబ్బ…
రేవంత్ ప్రజల కోసం పోరాడటం లేదని.., ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నారని ఆరోపించారు. పీసీసీ పదవిపైనా కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి ఒక జూనియర్ అని వ్యాఖ్యనించిన పాల్.. ఈ పదవి నుంచి ఆయన్ను తొలగించి సీనియర్ నాయకులకు పీసీసీ పదవి కట్టబెట్టాలని అన్నారు. బడుగు బలహీనర్గాలకు పీసీసీ పదవి ఇవ్వాలని సూచించారు. పనిలో పనిగా సీఎం కేసీఆర్‌పైనా పాల్ నిప్పులు చెరిగారు. రూ.500 కోట్లతో పాత సచివాలయాన్ని నేలమట్టం చేసి రూ.610 కోట్లు పెట్టి నూతన సెక్రటేరియట్ నిర్మించి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆక్షేపించారు. ఈనెల 17న కేసీఆర్ పుట్టినరోజున సెక్రటేరియట్ ఓపెన్ చేయటం సరికాదని కేఏ పాల్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున నూతన సెక్రటేరియట్ ప్రారంభించాలని అన్నారు.
Also Read : అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలకు గది కేటాయించకపోవటంపై మండిపడ్డ ఈటల…
ఈ విషయంపై తాను న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించినట్లు చెప్పారు. సెక్రటేరియట్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపైన కూడా సీబీఐకి కంప్లైంట్ చేశానని.. కేంద్ర మంత్రుల దృష్టికి సైతం తీసుకొచ్చినట్లు పాల్ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ప్రగతి భవన్‌పై తాను చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి సమర్థించుకున్నారు. అమరవీరుల కుటుంబాలను కూడా ప్రగతిభవన్‌లో అడుగుపెట్టనివ్వకుండా నిషేధం పెట్టారని.., అలాంటి ప్రగతి భవన్ ఉంటే ఎంత ? పోతే ఎంత? అని మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సామాన్య ప్రజలతో పాటు ఎంపీలు, ఎమ్మేల్యేలకు కూడా ప్రగతి భవన్‌లోకి ప్రవేశం లేదని ఆరోపించారు. ఎవరైతే తెలంగాణను వ్యతిరేకించారో వారు మాత్రమే ప్రగతి భవన్‌లోకి స్థానం సంపాదించుకున్నారన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని.., తనకేమీ కేసులు కొత్త కాదని, ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చునని సూచించారు.
ఇవి కూడా చదవండి :
- హైద్రాబాద్ పాతబస్తీలో దారుణం… మద్యం తాగించి బాలికపై సామూహిక అత్యాచారం
- రేవంత్ రెడ్డి వ్యాక్యలపై బిఆర్‌ఎస్ నేతల సీరియస్…. పాదయాత్ర అడ్డుకుంటామని వార్నింగ్
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం… అత్తారింట్లో అల్లుడి దారుణ హత్య
- అమెరికాలో గన్ మిస్ ఫైర్.. తెలంగాణ విద్యార్థి మృతి… ఈ ఘటనలో ట్విస్ట్
- 40 రోజులుగా కనిపించని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్…
One Comment