
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మహిళలు, యువతులు, బాలికలపై లైంగిక దాడులను అరికట్టేందుకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వారిపై అఘాత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలికకు కొందరు యువకులు మద్యం తాగించి, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Read Also : రేవంత్ రెడ్డి వ్యాక్యలపై బిఆర్‌ఎస్ నేతల సీరియస్…. పాదయాత్ర అడ్డుకుంటామని వార్నింగ్
ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణకు ఘటనకు సంబంధించి పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన ఓ బాలిక ఫిబ్రవరి 4వ తేదీన మందులు కొనుగోలు చేసేందుకు తనకు తెలిసిన హోల్ సేల్ ఔషధాలు విక్రయించే దుకాణం వద్దకు వెళ్లింది. అక్కడేవున్న ముగ్గురు యువకులు తక్కువ ధరకు మందులు ఇప్పిస్తామని నమ్మించి.. బాలికను కందికల్ లోని బోయిగూడలో ఓ ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆ బాలికతో బలవంతంగా హుక్కా తాగించారు. ఆ తర్వాత కాసేపటికి కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి బాలికకు తాగించారు. ఆ తర్వాత ఆమెతో యువకులు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె కేకలు వేసింది. దీంతో బాధితురాలి అరుపులు బయటకు వినపడకుండా మ్యూజిక్ సిస్టంలో సౌండ్ పెంచారు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. బాలికపై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలిక మత్తులో జారుకోగానే.. ఆమెపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు.
Also Read : రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం… అత్తారింట్లో అల్లుడి దారుణ హత్య
మెలుకువ రాగానే వారి నుంచి తప్పించుకున్న బాలిక.. ఇంటికి చేరుకుంది. జరిగిన విషయాన్ని ఏడ్చుకుంటూ తన తల్లికి చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఇచ్చిన వివరాలతో నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. చివరికు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో నిందితులు ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా.. వారిలో ముగ్గురు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ఇద్దరు వారికి సహకరించినట్లు చెప్పారు. ఐదుగురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు పంపారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
ఇవి కూడా చదవండి :
- కేసీఆర్ ను వణికిస్తున్న ఒవైసీ బ్రదర్స్… ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేస్తే ఏం జరుగుతుంది?
- హైదరాబాద్ విచ్చేసిన డబుల్ డెక్కర్ బస్సులు… రోడ్లపై పరుగులు పెట్టనున్న బస్సులు
- యదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి… మంత్రి కేటిఆర్
- ప్రతిపక్షపార్టీల కార్యకర్తలు సంక్షేమ పథకాలు తీసుకోవద్దు…. మిర్యాలగూడ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు
- బీఆర్ఎస్ నేత దూషించడాని…. ప్రభుత్వ మహిళా అధికారిని ఆత్మహత్యాయత్నం
One Comment