
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన వివాహానికి సంబంధించిన వార్త ఎప్పుడు చెబుతాడా అని ఇంట్రస్టింగ్ గా ఉన్నారు. అయితే ప్రభాస్ పెళ్లిపై ఇప్పటికే అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆయన పెళ్లి అంతుచిక్కని ప్రశ్నగా మారింది. గతంలో ప్రభాస్ హీరోయిన్ అనుష్కను పెళ్లి చేసుకుంటాడని పుకార్లు షికార్లు చేశాయి. ఆ వార్తల్లో నిజం లేదని అనుష్క కొట్టిపారేసింది. అటు ప్రభాస్ కూడా వార్తలను సున్నితంగానే తిరస్కరించాడు. ఇక ఆదిపురుష్ సినిమా ప్రారంభమైన నాటి నుంచి ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తున్న కృతి సనన్ పేరుతో ముడిపెట్టడం మొదలైంది.
Read Also : రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చెయ్యాలి… కేఏ పాల్ సంచలన వ్యాక్యలు
సీతగా నటిస్తున్న హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలొచ్చాయి. అదంతా అబద్ధమని ప్రభాస్, కృతి సనన్ కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఫేమస్ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు .. ప్రభాస్, కృతి సనన్ వచ్చేవారం మాల్దీవుల్లో నిశ్చితార్ధం చేసుకోబోతున్నారంటూ ట్వీట్ చేశాడు. వారి ఎంగేజ్ మెంట్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నానని చెప్పాడు. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్ గా మారింది. గతంలో ఓ డ్యాన్స్ షోలో పాల్గొన్న బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ .. ప్రభాస్, కృతి సనన్ ప్రేమపై హింట్ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచే ఈ పుకార్లు మొదలయ్యాయి. వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. కృతి సనన్ ఆ షోకి రాకపోవడానికి కారణాలు చెప్పాడు.
Also Read : ఎంఎల్‌ఏల ఎర కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ లో ఎదురుదెబ్బ…
కృతి సనన్ బాయ్ ఫ్రెండ్ ముంబైలో లేడని .. అతడు దీపికా పడుకొనేతో షూటింగ్ లో బిజీగా ఉన్నాడని చెప్పాడు. అయితే ఆ సమయంలో దీపికతో సినిమా షూటింగ్ చేస్తున్నది ప్రభాసే. ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్ లో ఇద్దరు పాల్గొంటున్నారు. దీంతో వరుణ్ చెప్పిన దాని ప్రకారం కృతి సనన్ బాయ్ ఫ్రెండ్ ప్రభాస్ అని.. వాళ్లిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారని స్పష్టమైంది. ఇక అప్పటి నుంచి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఉమైర్ సంధు ట్వీట్ తో ఆ వార్తలు మరింత బలపడ్డాయి. మరి వచ్చే వారం ప్రభాస్, కృతి సనన్ ఎంగేజ్ మెంట్ జరుగుతుందో.. లేదో.. చూడాలి మరి.
ఇవి కూడా చదవండి :
- అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలకు గది కేటాయించకపోవటంపై మండిపడ్డ ఈటల…
- హైద్రాబాద్ పాతబస్తీలో దారుణం… మద్యం తాగించి బాలికపై సామూహిక అత్యాచారం
- రేవంత్ రెడ్డి వ్యాక్యలపై బిఆర్‌ఎస్ నేతల సీరియస్…. పాదయాత్ర అడ్డుకుంటామని వార్నింగ్
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం… అత్తారింట్లో అల్లుడి దారుణ హత్య
- అమెరికాలో గన్ మిస్ ఫైర్.. తెలంగాణ విద్యార్థి మృతి… ఈ ఘటనలో ట్విస్ట్