
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సీఎం అధికారిక నివాసం ప్రగతిభవన్‌ను నక్సలైట్లు పేల్చివేసినా నష్టమే ఉండదని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చు రేపుతోన్నాయి. ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. రేవంత్ కామెంట్స్‌పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా, అల్లర్లు సృష్టించేలా ప్రవర్తిస్తున్న రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదులు చేసేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని ములుగు పోలీస్ స్టేషన్‌లో అధికార బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
Read Also : రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం… అత్తారింట్లో అల్లుడి దారుణ హత్య
రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ కోరారు. రేవంత్ రెడ్డి ఇలాగే విద్వేషాలు రెచ్చగొడితే పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డిపై పోలీస్‌స్టేషన్లలో కంప్లైంట్ చేయాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. దీంతో రేవంత్‌పై కేసు నమోదు చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ములుగు జిల్లాలో రేవంత్ పాదయాత్ర జరుగుతుండగా మంగళవారం నాడు ములుగు కూడలిలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రవేశంలేని ప్రగతిభవన్‌ను పేల్చేయాలని వ్యాఖ్యానించారు.
Also Read : కేసీఆర్ ను వణికిస్తున్న ఒవైసీ బ్రదర్స్… ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేస్తే ఏం జరుగుతుంది?
ఆనాడు గడీలను గ్రానేట్‌లతో పేల్చిన నక్సలైట్లు.. ఇప్పుడు బాంబ్‌లతో ప్రగతిభవన్ పేల్చేయాలని పిలుపునిచ్చారు. ప్రగతిభవన్ ఆనాటి గడీలను తలపిస్తుంది తప్పా, పేదోడీకీ న్యాయం అక్కడ జరగదని ఆరోపించారు. కేసీఆర్ పేదలకు ఇళ్లు ఇవ్వలేదని, కానీ హైదరాబాద్ నడిబొడ్డున 10 ఎకరాల్లో రూ.2000 కోట్లతో 150 గదుల ప్రగతి భవన్ నిర్మించుకున్నారని విమర్శించారు. ఎవరైనా ప్రజలు ప్రగతిభవన్‌కు వెళ్ళారా? అని ప్రశ్నించారు. ప్రగతి భవన్‌లో ఏపీ పెట్టుబడుదారులను ఎర్రతీవాచీతో స్వాగతిస్తున్నారని, అలాంటి ప్రగతిభవన్ మనకు ఎందుకు? అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్ విచ్చేసిన డబుల్ డెక్కర్ బస్సులు… రోడ్లపై పరుగులు పెట్టనున్న బస్సులు
- యదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి… మంత్రి కేటిఆర్
- ప్రతిపక్షపార్టీల కార్యకర్తలు సంక్షేమ పథకాలు తీసుకోవద్దు…. మిర్యాలగూడ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు
- బీఆర్ఎస్ నేత దూషించడాని…. ప్రభుత్వ మహిళా అధికారిని ఆత్మహత్యాయత్నం
- రసవత్తరంగా ఖమ్మం జిల్లా రాజకీయం… పొంగులేటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన తాత మధు