
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపాలపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ భారీ భూకంప దాటికి వేల మంది ప్రాణాలు కోల్పోయారు. టర్కీ, సిరియాలో చోటు చేసుకున్న భూకంప దృశ్యాలు తనను తీవ్రంగా కలిచివేశాయని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఘటన మానవాళికి చాలా బాధాకరమన్నారు. టర్కీ, సిరియా ప్రజలకు ఆ భగవంతుడు మరింత శక్తినివ్వాలని కోరుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Also : ఖమ్మం జిల్లాపై బీఆర్ఎస్ ఫోకస్… ఈ నెలలో పర్యటించనున్న కేటీఆర్, హరీష్
సోమవారం తెల్లవారుజామున టర్కీ, సిరియాను భూకంపం వణికించింది. మూడు సార్లు బలమైన భూ కంపం రావడంతో టర్కీ, సిరియాలో తీవ్ర ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం భారీగా జరిగింది. ఈ భూకంపం వల్ల ప్రస్తుతం ఉన్న సమాచారం వరకు దాదాపు 4,500 మంది మృతి చెందారు. రిక్టర్ స్కేల్ పై 7.8 తీవ్రత భూమి అనే సార్లు కంపించిడంతో టర్కీలోని చాలా నగరాలు అల్లాడిపోయాయి. భూ కంప తీవ్రతకు పెద్ద భవనాలు కుప్పకూలిపోయాయి. భూప్రళయంతో అతాలకుతలమైన తుర్కియే, సిరియాలకు ఆపన్నహస్తం అందించేందుకు భారత్ పాటు పలు దేశాలు ముందుకొచ్చాయి.
Also Read : కార్యకర్తతో బాబు మోహన్ బూతు పురాణం… ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానంటూ వార్నింగ్
మంగళవారం ఉదయం భారత్ నుంచి సహాయక సామగ్రితో కూడిన ఓ విమానం తుర్కియేకు బయల్దేరింది. ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు, సహాయక బృందాలు, ఔషధాలు, డ్రిల్లింగ్ యంత్రాలు, ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌ను పంపించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు ఈ సంక్షోభంపై అంతర్జాతీయంగా స్పందించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చారు. యూరోపియన్ యూనియన్ శోధన, రెస్క్యూ బృందాలను టర్కీకి పంపుతోంది. 76 నిపుణులు, పరికరాలు రెస్క్యూ డాగ్‌లను పంపనున్నట్లు UK తెలిపింది. ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్, యుఎస్ కూడా సహాయం చేయడానికి ముందుకొచ్చాయి.
ఇవి కూడా చదవండి :
- నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. నర్సులంటే నాకు గౌరవం-బాలకృష్ణ
- తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు… అక్బరుద్దీన్‌తో కాంగ్రెస్ నేతల సుదీర్ఘ భేటీ
- తెలంగాణ వార్షిక బడ్జెట్ పై బండి సంజయ్, ఈటల రాజేందర్ ల సెటైర్లు….
- మూడవసారి వాయిదా పడిన ఢిల్లీ మేయర్ ఎన్నిక… ఆప్, బీజేపీ మధ్య వాగ్వాదం
- బీఆర్ఎస్‌పై పొంగులేటి మరోసారి ఫైర్… తనను సస్పెండ్ చేయాలని సవాల్
One Comment