
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్ కార్యకర్తపై బూతు పురాణం ఎత్తుకున్నారు. పార్టీలో మీతో కలిసి పనిచేస్తానంటూ ఫోన్ చేసిన అందోల్ నియోజకవర్గానికి చెందిన వెంకటరమణ అనే కార్యకర్తపై శివాలెత్తారు. ‘అసలు నువ్వెవడికి..? నీ స్థాయి ఎంత..? నీ బ్రతుకెంత..?’ అంటూ తిట్ల పురాణంతో చెలరేగిపోయారు. తాను ప్రపంచస్ధాయి నాయకుడినని, అసలు నీ బ్రతుకెంత? అంటూ కించపరుస్తూ మాట్లాడారు. ‘బండి సంజయ్ ఎవడ్రా.. వాడు నా తమ్ముడు’ అని బాబు మోహన్ ఫోన్ కాల్‌లో మాట్లాడారు. ‘అవసరమైతే రేపే పార్టీకి రాజీనామా చేస్తా.. నువ్వు కావాలో.. నేను కావాలో పార్టీ తేల్చుకుంటుంది.
Read Also : నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. నర్సులంటే నాకు గౌరవం-బాలకృష్ణ
2 రాష్ట్రాల్లో పనిచేసేందుకు నన్ను అమిత్ షా బీజేపీలో చేర్చుకున్నారు’ అని కార్యకర్తపై బాబు మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి తనకు ఫోన్ చేస్తే జోగిపేటలో చెప్పుతో కొడతానంటూ కార్యకర్తను హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నీ వయస్సు ఎంత గాడిద.. కావాలంటే ఫోన్ కాల్ రికార్డు చేసుకో.. ఇంకోసారి ఫోన్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అంటూ హెచ్చరించారు. బాబు మోహన్ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతోండగా.. రాజకీయంగా ఆయన అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. అప్పుడప్పుడు ప్రెస్‌మీట్లు పెట్టి సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు. కార్యకర్తలతో బాబు మోహన్ అంతగా పరిచయాలు పెట్టుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందోల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.
Also Read : మూడవసారి వాయిదా పడిన ఢిల్లీ మేయర్ ఎన్నిక… ఆప్, బీజేపీ మధ్య వాగ్వాదం
2004, 2009లో అందోల్ నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ చేతిలో రెండుసార్లు ఓటమి చెందారు. 2014లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అందోల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి దామోదర రాజనర్సింహపై గెలిచారు. సీఎం కేసీఆర్‌తో విబేధాలు రావడంతో 2018లో టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాషాయ పార్టీలో చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. కానీ రాజకీయంగా ఆయన ఇంతకముందులా క్రియాశీలకంగా కనిపించడం లేదు.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు… అక్బరుద్దీన్‌తో కాంగ్రెస్ నేతల సుదీర్ఘ భేటీ
- వామ్మో విమానంలో మంటలు..భయాందోళనలో ప్రయాణికులు.. వీడియో వైరల్
- తెలంగాణ వార్షిక బడ్జెట్ పై బండి సంజయ్, ఈటల రాజేందర్ ల సెటైర్లు….
- బీఆర్ఎస్‌పై పొంగులేటి మరోసారి ఫైర్… తనను సస్పెండ్ చేయాలని సవాల్
- ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సంస్థల్లో ముగిసిన ఐటి దాడులు… కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

One Comment