
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ బడ్జెట్‌పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్ వేశారు. కొత్త సీసాలో పాత సార పోసినట్లు బడ్జెట్ ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హరీష్ రావు కొత్త సంవత్సరం కదా అని కొత్త సీసా తీసుకొని ఫామ్‌హౌజ్‌కి వెళ్లారని, అందులో ఆయన మామ పాత సార పోశారని సెటైర్ పేల్చారు. బడ్జెట్‌లో కొత్తగా ఏమీ లేదని, గత ఏడాది బడ్జెట్‌నే కాపీ పేస్ట్ చేశారని ఆరోపించారు. బడ్జెట్‌ను వేస్ట్ పేపర్‌లా మార్చారని, చెత్తబుట్టలో పడేసేలా చేస్తున్నారని విమర్శించారు. గత బడ్జెట్ కేటాయింపులు మాదిరిగా ఈ సారి కూడా లెక్కలు చూపించారని షర్మిల తెలిపారు. అలాగే రైతు రుణమాఫీ పథకానికి బడ్జెట్‌లో తక్కువ నిధులు కేటాయించడంపై షర్మిల ఫైర్ అయ్యారు.
Read Also : టర్కీ, సిరియా భూకంప దృశ్యాలు మనస్సును కలచివేస్తున్నాయి… కేటిఆర్ ట్వీట్
రాష్ట్రంలో పూర్తి స్థాయి రుణమాఫీ కావాలంటే రూ.19 వేల కోట్ల నిధులు కావాలని, కానీ బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. రూ.6 వేల కోట్లతో ఎంతమందికి రుణం మాఫీ చేస్తారని, రాష్ర్టంలో 25 లక్షల మంది రైతులను మోసం చేసినట్లే కదా.. అని షర్మిల ప్రశ్నించారు. గతేడాది బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు మీద సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేటాయింపులకు ,ఖర్చులకు పొంతనే లేదని ఆరోపించారు. గతంలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు రూ.12 వేల కోట్లు, దళిత బందుకు రూ.17 వేల కోట్లు పెట్టారని, ఈ ఏడాది అయినా కేటాయింపులకు న్యాయం చేస్తారని గ్యారెంటీ ఉందా..? అని షర్మిల ప్రశ్నించారు. ‘పథకాలకు బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టకపోతే ఎందుకు..? 8 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు.
Also Read : ఖమ్మం జిల్లాపై బీఆర్ఎస్ ఫోకస్… ఈ నెలలో పర్యటించనున్న కేటీఆర్, హరీష్
ముఖ్యమంత్రి అన్నాక ఇచ్చిన మాటకు విలువ ఉండదా..? సీఎం మాటలు మాత్రం కోటలు దాటుతాయి.చేతలు మాత్రం గడప దాటవు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్పితే మిగతా ప్రాజెక్టులన్నీ పూర్తి కాలేదు. రైతు బందు అని రూ.10 వేలు ఇచ్చి అన్ని సబ్సిడీ పథకాలు బంద్ పెట్టారు. రూ.10 వేలతో రైతును రారాజు చేస్తే ఆత్మహత్యలు ఎందుకు అవుతాయి? అని షర్మిల ప్రశ్నించారు. ‘బడ్జెట్‌లో కేటాయింపులు ఘనంగా చూపిస్తారు.ఇంత బడ్జెట్ ఉంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఇప్పటి వరకు రూ.3600 కోట్లు ఎలా బాకీలు పడ్డారు..? ఆరోగ్య శ్రీ బాకీలు రూ.860 కోట్లు ఎలా ఉన్నాయి. డబుల్ బెడ్ రూం ఇళ్లల్లో సగం కూడా పూర్తి కాలేదు. ఈ సారి కేటాయించిన రూ.12 వేల కోట్లతో అన్ని ఇల్లులు కట్టించి ఇస్తారా..?’ అని షర్మిల ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి :
- కార్యకర్తతో బాబు మోహన్ బూతు పురాణం… ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానంటూ వార్నింగ్
- నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. నర్సులంటే నాకు గౌరవం-బాలకృష్ణ
- తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు… అక్బరుద్దీన్‌తో కాంగ్రెస్ నేతల సుదీర్ఘ భేటీ
- తెలంగాణ వార్షిక బడ్జెట్ పై బండి సంజయ్, ఈటల రాజేందర్ ల సెటైర్లు….
- బీఆర్ఎస్‌పై పొంగులేటి మరోసారి ఫైర్… తనను సస్పెండ్ చేయాలని సవాల్
4 Comments