
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం సంభవించింది. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లిలోని టాటా నగర్‌లో కార్ల స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు చుట్టుపక్కల ప్రాంతాల్లో కమ్ముకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో గోదాంలో పనిచేస్తున్న కార్మికులు పరుగులు తీశారు. పొగలు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వ్యాపించడంతో స్థానికులు కూడా పరుగులు పెట్టారు. కార్ షెడ్‌లో వెల్డింగ్ చేస్తుండగా ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Read Also : “కొత్త సీసాలో పాత సార పోసినట్లు”… తెలంగాణ బడ్జెట్‌పై వైఎస్ షర్మిల సెటైర్
మంటలకు షెడ్డులో ఉన్న సామాన్లు అన్నీ కాలిపోవడంతో మంటలకు వ్యాపించాయని కార్మికులు చెబుతున్నారు. మంటలను గమనించి కార్మికులు బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మంటల్లో కారు షెడ్డు పూర్తిగా దగ్ధమైంది. వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయని చెబుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలంలో ఉన్న కార్మికులను ప్రశ్నిస్తున్నారు.
Also Read : టర్కీ, సిరియా భూకంప దృశ్యాలు మనస్సును కలచివేస్తున్నాయి… కేటిఆర్ ట్వీట్
ఈ అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇటీవల రాజేంద్రనగర్‌లో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా పలు కంపెనీలకు చెందిన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేస్తున్నారని, ఈ కారణంగానే అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇటీవల నగరంలో వరుస అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. తరచూ నగరంలో ఎక్కడో ఒకచోట అగ్నిప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
ఇవి కూడా చదవండి :
- ఖమ్మం జిల్లాపై బీఆర్ఎస్ ఫోకస్… ఈ నెలలో పర్యటించనున్న కేటీఆర్, హరీష్
- కార్యకర్తతో బాబు మోహన్ బూతు పురాణం… ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానంటూ వార్నింగ్
- నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. నర్సులంటే నాకు గౌరవం-బాలకృష్ణ
- తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు… అక్బరుద్దీన్‌తో కాంగ్రెస్ నేతల సుదీర్ఘ భేటీ
- నియోజకవర్గానికి 2000 మంది లబ్ధిదారులకు 3 లక్షల ఆర్ధిక సహాయం…. దళితబంధుపై కీలక ప్రకటన
One Comment