
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నెలరోజుల నుంచి ప్రజలకు కనిపించడం లేదు. ఎలాంటి సభలు,సమావేశాల్లో ఆయన పాల్గొన్న దాఖలాలు కూడా లేవు. కొరియన్ పీపుల్స్ ఆర్మీ ఏర్పాటై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా త్వరలో రాజధాని నగరమైన ప్యాంగ్‌యాంగ్ లో ఓ పెద్ద ఉత్సవం జరగబోతోంది. ఇంతటి కీలక ఉత్సవం ఉన్నా కిమ్ జోంగ్ జనంలో ఎక్కడ కనపడటం లేదు. ప్యాంగ్ యాంగ్ లో ఉత్తరకొరియా సైన్యం కవాతుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవంలో దేశం సొంతంగా తయారు చేసిన క్షిపణులు , అణ్వాయుధాలను ఈ పరేడ్ లో ప్రదర్శించే అవాకాశాలున్నాయి.
Read Also : యదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి… మంత్రి కేటిఆర్
ఇందుకోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రాక్టీస్ జరుగుతుందని శాటిలైట్ విజువల్స్ ద్వారా తెలుస్తోంది. కిమ్ కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కిమ్ జోంగ్ గతంలో హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని వార్తలు వస్తున్నాయి. ఆయనకు ‘బ్రెయిన్ డెడ్’ అయ్యిందన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై వదంతులు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా రకరకాల కథనాలు వచ్చాయి. అయితే కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై ఉత్తర కొరియా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పూర్తి గోప్యత పాటిస్తోంది.
ఇవి కూడా చదవండి :
- ప్రతిపక్షపార్టీల కార్యకర్తలు సంక్షేమ పథకాలు తీసుకోవద్దు…. మిర్యాలగూడ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు
- రసవత్తరంగా ఖమ్మం జిల్లా రాజకీయం… పొంగులేటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన తాత మధు
- బీఆర్ఎస్ నేత దూషించడాని…. ప్రభుత్వ మహిళా అధికారిని ఆత్మహత్యాయత్నం
- హైద్రాబాద్ రాజేంద్రనగర్‌లో కార్ల స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం…
- “కొత్త సీసాలో పాత సార పోసినట్లు”… తెలంగాణ బడ్జెట్‌పై వైఎస్ షర్మిల సెటైర్
3 Comments