
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పమయ్యాయి. దామరచర్ల మండలంలోని నర్సాపూర్ గ్రామంలో పర్యటించిన ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. అలా విమర్శించే వారు సీఎం కేసీఆర్ అమలు చేస్తు్న్న సంక్షేమ పథకాలు తీసుకోవద్దని, బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన రోడ్లపై నడవరాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.
Read Also : రసవత్తరంగా ఖమ్మం జిల్లా రాజకీయం… పొంగులేటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన తాత మధు
“తిని సున్నం బొట్లు పెడితే సరికాదు. ఆ దేవుడనేవాడు ఉన్నడు. కల్లేపల్లి మైసమ్మ ఉంది. మీ అందరి సంగతి ఆ కల్లేపల్లి మైసమ్మ చూస్తది. మీరంతా ఓ పని చేయండి. వేరే పార్టీవాడెవడూ మా రోడ్డు మీద నడవకండి. కేసీఆర్ వేసిన రోడ్డు మీద నడవొద్దు, కేసీఆర్ ఇచ్చే రైతు బంధు తీసుకోవద్దు, కేసీఆర్ ఇచ్చే పెన్షన్ తీసుకోవద్దు, కేసీఆర్ ఇచ్చే కల్యాణ లక్ష్మీ తీసుకోకుండా ఉండండి. ఇవన్నీ తీసుకుంటాం.. మా డ్యాన్స్ మేం చేస్తాం అనే ఆలోచన గనుక మీకు ఉంటే.. నేను కూడా డ్యాన్స్ చేపిస్తా. నా సంగతి మీకు తెలియదు. మర్యాదగా ఉంటే మర్యాదగానే ఉంటా. మర్యాద తప్పితే మాత్రం ఐదు నిమిషాల్లో ఎట్ల చేపించాల్నో అట్ల డ్యాన్స్ చేపిస్తా. మీ నర్సాపూర్‌తోనే నాకేదో అయితదని మీరనుకుంటున్నరు. మీతోని ఏమీ కాదు.” అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read : బీఆర్ఎస్ నేత దూషించడాని…. ప్రభుత్వ మహిళా అధికారిని ఆత్మహత్యాయత్నం
ఎమ్మెల్యే భాస్కర్ రావు చేసిన వ్యాఖ్యలపై నర్సాపూర్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటమేంటని మండిపడుతున్నారు. కాగా.. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన కామెంట్లపై నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని అంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- హైద్రాబాద్ రాజేంద్రనగర్‌లో కార్ల స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం…
- “కొత్త సీసాలో పాత సార పోసినట్లు”… తెలంగాణ బడ్జెట్‌పై వైఎస్ షర్మిల సెటైర్
- టర్కీ, సిరియా భూకంప దృశ్యాలు మనస్సును కలచివేస్తున్నాయి… కేటిఆర్ ట్వీట్
- ఖమ్మం జిల్లాపై బీఆర్ఎస్ ఫోకస్… ఈ నెలలో పర్యటించనున్న కేటీఆర్, హరీష్
- కార్యకర్తతో బాబు మోహన్ బూతు పురాణం… ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానంటూ వార్నింగ్
One Comment