
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలన్నీ రంగంలోకి దిగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. రాజకీయ పార్టీలకు వ్యూహలకు పదును పెడుతుండటంతో.. తెలంగాణలో ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైపోయింది. ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని ప్రచారం జరుగుతున్న వేళ పార్టీలన్నీ మరింత దూకుడు పెంచుతున్నాయి. పార్టీ బలహీనంగా ఉన్నచోట పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాపై బీఆర్ఎస్ గురి పెట్టింది. ఇతర జిల్లాలతో పోలిస్తే ఖమ్మంలో బీఆర్ఎస్ బలహీనంగా ఉంది. నేతల మధ్య ఆధిపత్య పోరు, అంతర్గత విబేధాలతో జిల్లా పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
Read Also : కార్యకర్తతో బాబు మోహన్ బూతు పురాణం… ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానంటూ వార్నింగ్
నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అధిష్టానం రంగంలోకి దిగి పలుమార్లు రాజీ చేసే ప్రయత్నాలు చేసినా.. అవి పెద్దగా ఫలించలేదు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిన గులాబీ బాస్.. ఇటీవల భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు జాతీయ నేతలను కూడా ఆహ్వానించారు. బీఆర్ఎస్ తొలి సభకు ఖమ్మంను ఎంచుకోవడం వెనుక అసలు కారణం పార్టీని బలపర్చుకోవడమేననే వాదనలు వినిపించాయి. అయితే ఈ సారి మంత్రి కేటీఆర్, హరీష్ రావు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల వేళ అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్న కేటీఆర్.. అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 10వ తేదీన ఖమ్మంలో కేటీఆర్ పర్యటించనున్నారు. రూ.6.50 కోట్లతో ఖమ్మంలో నిర్మించిన వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, గోళ్లపాడు అధునాతన పార్కుకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇక ఈ నెల 10 నుంచి 14వ తేదీలోపు మంత్రి హరీష్ రావు ఖమ్మంలో పర్యటించనున్నారు.
Also Read : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు… అక్బరుద్దీన్‌తో కాంగ్రెస్ నేతల సుదీర్ఘ భేటీ
ఈ పర్యటనలో భాగంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నారు. గత నెలలో ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభలో నెల రోజుల్లో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఒక్కో జర్నలిస్టుకు 200 గజాల స్థలాన్ని హరీష్ రావు చేతుల మీదుగా అందించనున్నారు. ఒకే నెలలో ఇద్దరు బీఆర్ఎస్ అగ్రనేతలు జిల్లాలో పర్యటిస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలలో భాగంగా జిల్లా నేతలతో సమావేశమయ్యే అవకాశముందని, పార్టీ బలోపేతంపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్‌పై తిరుగుబాటు చేశారు. ఆయన వ్యవహారం ఖమ్మం జిల్లా పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో పొంగులేటి వెంట బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా ఇప్పటికే అధిష్టానం చర్చలు జరుపుతోంది. ఇలాంటి నేపథ్యంలో కేటీఆర్, హరీష్ పర్యటన ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి :
- బీఆర్ఎస్‌పై పొంగులేటి మరోసారి ఫైర్… తనను సస్పెండ్ చేయాలని సవాల్
- నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. నర్సులంటే నాకు గౌరవం-బాలకృష్ణ
- తెలంగాణ వార్షిక బడ్జెట్ పై బండి సంజయ్, ఈటల రాజేందర్ ల సెటైర్లు….
- నియోజకవర్గానికి 2000 మంది లబ్ధిదారులకు 3 లక్షల ఆర్ధిక సహాయం…. దళితబంధుపై కీలక ప్రకటన
- మూడవసారి వాయిదా పడిన ఢిల్లీ మేయర్ ఎన్నిక… ఆప్, బీజేపీ మధ్య వాగ్వాదం
One Comment