
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్ వాసులకు శుభవార్త నగరవాసులు ఎప్పటినుంచో ఎదురు చూస్తోన్న డబుల్ డెక్కర్ బస్సులు నగరానికి వచ్చేశాయి. గతంలో మంత్రి కేటీఆర్‌కు ఇచ్చిన మాట మేరకు.. నగరానికి డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను రవాణా శాఖ తీసుకొచ్చింది. కాగా ఈరోజు మూడు డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎంపీ రంజిత్ కుమార్, ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ, సీఎస్ శాంతి కుమారి తదితరులు ఉన్నారు. అనంతరం బస్సులో ప్రయాణించి జర్నీ ఆస్వాధించారు. ఇక నుంచి ఈ మూడు డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ నగర రోడ్లపై పరుగులు తీయనున్నాయి. మరో మూడు బస్సులను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు అధికారులు తెలిపారు. ఈ బస్సులు నగరంలోని ప్రముఖ పర్యటక ప్రాంతాల మార్గాల్లో నడపనున్నారు.
Read Also : అమెరికాలో గన్ మిస్ ఫైర్.. తెలంగాణ విద్యార్థి మృతి… ఈ ఘటనలో ట్విస్ట్
ఇక బస్సుల విషయానికొస్తే ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో ఈ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో 300 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఇప్పటికే.. టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ముందుగా చెప్పారు. అయితే అందులో 10 డబుల్ డెక్కర్ బస్సులుంటాయని ముందు నుంచే చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మూడు డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. సాంప్రదాయ డబుల్ డెక్కర్ బస్సులు నిజాంచే ప్రారంభించబడ్డాయి. ఇవి 2003 వరకు నగరంలో తిరిగాయి. ట్విట్టర్‌లో పౌరుడి అభ్యర్థన మేరకు ఆ బస్సులలో ప్రయాణించిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న కేటీఆర్ డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి తీసుకురావడానికి గల అవకాశాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.
Also Read : 40 రోజులుగా కనిపించని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్…
ఆయన సూచనల మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చింది. అందులో మూడు బస్సులను డెలివరీ చేసి మంగళవారం ప్రారంభించారు. మిగిలిన మూడు బస్సులు కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. HMDA ఈ డెక్కర్ బస్సులను 20 బస్సులకు విస్తరించాలని యోచిస్తోంది. ఒక్కో బస్సు ధర రూ.2.16 కోట్లు మరియు 7 సంవత్సరాల AMCతో వస్తుంది. బస్సుల్లో డ్రైవర్‌తో పాటు 65 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది. ఈ బస్సులు పూర్తిగా ఎలక్ట్రిక్‌తో ఒకే ఛార్జ్‌లో 150 కిమీల పరిధిని కలిగి ఉంటాయి. 2-2.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయబడతాయి. ఈ బస్సుల మొత్తం పొడవు 9.8మీ మరియు ఎత్తు 4.7మీ.
ఇవి కూడా చదవండి :
- యదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి… మంత్రి కేటిఆర్
- ప్రతిపక్షపార్టీల కార్యకర్తలు సంక్షేమ పథకాలు తీసుకోవద్దు…. మిర్యాలగూడ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు
- రసవత్తరంగా ఖమ్మం జిల్లా రాజకీయం… పొంగులేటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన తాత మధు
- బీఆర్ఎస్ నేత దూషించడాని…. ప్రభుత్వ మహిళా అధికారిని ఆత్మహత్యాయత్నం
- కార్యకర్తతో బాబు మోహన్ బూతు పురాణం… ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానంటూ వార్నింగ్