
క్రైమ్ మిర్రర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : “” సంతలో సడే మియా అన్నట్లు రైతు బజారు చోరీ బజార్ గా తయారై సంతకు వచ్చిన వారి జేబుల్లో సెల్ ఫోన్లు మాయం అవుతున్నాయి. ఆదివారం వస్తే చాలు ఆ సంతలో సరుకులు కొనే పనిలో నిమగ్నమైతే అగంతకులు మాత్రం జేబుల్లో నుండి సెల్ ఫోన్స్ మూడో కంటికి తెలియకుండా మటుమాయం చేసే పనిలో నిమగ్నమవుతున్నారు. ఈతతంగమంతా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు బజార్లో ప్రతి ఆదివారం గత మూడు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉందని సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే సీసీ కెమెరాలు ఉన్న కనీసం అవి పని చేస్తున్నాయా…?? లేదా అనే పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అంటారు కానీ ఇది చెప్పుకోవడానికే పనికొస్తుందని విషయం ఈ రైతు బజార్లో చోరీ అయ్యే సెల్ ఫోన్ చోరీలను బట్టి చూస్తేనే అర్థమవుతుందని తెలుస్తుంది.””
Read Also : నియోజకవర్గానికి 2000 మంది లబ్ధిదారులకు 3 లక్షల ఆర్ధిక సహాయం…. దళితబంధుపై కీలక ప్రకటన
కొందరు కేటగాళ్లు చేస్తున్న దొంగతనాలకు పక్కాగా ఓ రోజున డిజైన్ చేసుకొని మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. అలాంటి సంఘటనలే వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు బజార్లో సెల్‌ఫోన్‌లు చోరీలకు గురవుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.గతంలో పండుగలు, వారాంతాల్లో రైల్వేస్టేషన్, బస్టాండ్ల వద్ద దొంగలు తమ చేతివాటం చూపేవారు. కానీ ఇప్పుడు రైతు బజార్లో ప్రతి ఆదివారం మార్కెట్ రద్దీ సమయంలో క్షణాల్లో సెల్‌ఫోన్లు మాయం చేస్తున్నారు. ఈతంగమంతా గత మూడు సంవత్సరాలుగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైతుబజార్లో జరుగుతుందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ సెల్ ఫోన్ చోరీలు జరుగుతున్న రైతు బజార్లో సీసీ కెమెరాలు ఉన్నా కూడా కేవలం అవి పేరుకే ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అన్నమాట కేవలం చెప్పుకోవడానికి పనికొస్తాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్లో చోరీకి గురైన సెల్ ఫోన్ బాధితుల ఫిర్యాదు కొన్నే ఉన్నాయి. సెల్ఫోన్ చోరీకి గురైన కూడా ఫిర్యాదులు ఇవ్వకుండా ఉన్నవారు వందల్లో ఉన్నట్లు తెలుస్తుంది.
Also Read : ఎంఎల్‌ఏల కొనుగోలు కేసులో హైకోర్ట్ కీలక తీర్పు… ప్రభుత్వ అప్పీల్ తిరస్కరణ
బాధితులకు అన్ని చోట్లా చేదు అనుభవాలే…!!
ఓ పక్క దొంగలు ఇలా వ్యవస్థీకృతంగా రెచ్చిపోతుంటే…బాధితులకు మాత్రం అన్ని చోట్లా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. సెల్‌ఫోన్ పోయిందని పోలీసులను ఆశ్రయిస్తే…వారి నుంచి సరైన స్పందన లభించడం లేదని కొందరు సెల్ ఫోన్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సెల్ ఫోన్ చోరీ కేసులను ఎఫ్‌ఐఆర్ కూడా చేయడంలేదనే ఆరోపణలు బాధితుల నుండి వస్తున్నాయి.ఫిర్యాదులకు జీడీ ఎంట్రీ పెట్టినా… వాటిపై తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం.సెల్‌ఫోన్ పోవడం సంగతి అటుంచితే అందులో ఉన్న డాటా కోసం బాధితులు ఆందోళన చెందుతున్నారు.ఫోన్లు పోగొట్టుకున్న వారిలో కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేస్తుండగా..మరికొంతమంది మిన్నకుండి పోతున్నారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారు దొంగతనాలు చేసి వెళ్తుండటంతో వారిని పట్టుకోవడం పోలీసులకు విఫలం చెందుతున్నారని వినికిడి వినిపిస్తుంది.
Read Also : 2,90,396 కోట్ల మొత్తంతో భారీ బడ్జెట్…శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు
ఐఎంఈఐ నంబర్ ఉన్నా ట్రాక్ కావట్లే…!!
సెల్‌ఫోన్ చోరీల కేసులను పోలీసులు లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.బాధితుల ఫిర్యాదులతో కొన్ని ఐఎంఈఐ నంబర్లను ట్రాకింగ్‌లో పెట్టినప్పటికీ ఫాలో అప్ చేయడం లేదు.సాధారణంగా సెల్‌ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను సర్వీస్ ప్రొవైడర్‌తో కలిసి కో ఆర్డినేట్ చేస్తుంటారు. దీన్ని ప్రతి వారం షెడ్యూల్ ప్రకారం ఆపరేట్ చేస్తుండాలి. మొబైల్ స్విచ్ ఆన్ చేసి అందులో సిమ్ కార్డ్ వేస్తే తప్ప సెల్‌ఫోన్ ట్రాకింగ్‌కి అవకాశం లేదు.దీంతో ఐఎంఈఐ ట్రాక్ కాని ఫోన్లను రికవరీ చేయడంపై దృష్టిపెట్టడం లేదు. ఇలాంటి ఫోన్లు కొన్ని నెలల తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఆన్ అవుతున్నాయి. వాటిని గుర్తించినప్పటికీ రికవరీపై పోలీసులు ఆసక్తి చూపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
Also Read : నేటి నుండే రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర… మేడారం నుండి ప్రారంభం
రైతు బజారులో మటుమాయం ….!!
ప్రతి ఆదివారం వికారాబాద్ రైతు బజార్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నాయని రైతు బజార్ కు వచ్చే పట్టణ వాసులు వివిధ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెల్‌ఫోన్ పోయిన బాధితులు వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు.ఇప్పటివరకు పోయిన సెల్‌ఫోన్లుగానీ,దొంగలుగానీ దొరకలేదు. దీంతో సంతకు వచ్చే ప్రజలు ఫోన్లు తీసుకురావాలంటేనే జంకుతున్నారు జనం.ఇప్పటికైనా పోలీసులు సెల్‌ఫోన్ దొంగలను పటుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- వచ్చే ఎన్నికల్లో 50 స్థానాలలో పోటీ… అక్బరుద్ధీన్ సంచలన ప్రకటన
- విజయమ్మతో పొంగులేటి భేటీ… పార్టీలో చేరికకు ముహూర్తం ఫిక్స్..???
- జడ్జికే లాయర్ షోకాజ్ నోటీసు… న్యాయవాదిపై కోర్టు ధిక్కరణ చర్యలు
- రాజేందరన్న ఇక్కడ ఉన్నప్పుడు మంచిగుండే.. అక్కడికి పోయినంక ఆగమైండు..” కేటిఆర్ కీలక వ్యాక్యలు
One Comment