
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : విమానంలో మంటలు వచ్చాయి. అది కూడా టేకాఫ్ అవుతుండగా మంటలు చెలరేగి పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే వెంటనే విమానం సిబ్బంది గుర్తించి అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటన థాయ్ లాండ్ లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. రష్యాలోని అజుర్ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 767 300 ఈఆర్ విమానం ఫుకెట్ నుంచి మాస్కోకు బయల్దేరింది. అందులో మొత్తం 300 మంది ప్రయాణికులు , 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానం టేకాఫ్ తీసుకుంటుండగా కుడివైపున ఇంజిన్, టైర్లలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దట్టమైన పొగ కూడా వచ్చింది.
Read Also : తెలంగాణ వార్షిక బడ్జెట్ పై బండి సంజయ్, ఈటల రాజేందర్ ల సెటైర్లు….
దీన్ని గుర్తించిన ఎయిర్ పోర్టు అధికారులు విమానాన్ని నిలిపివేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ప్రయాణికులను వేరే విమానంలో పంపించారు. విమానంలో పొగలు వస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు. ఈ వీడియోలో విమానం వెళ్తుండగా కుడివైపున రెక్కల నుంచి పొగలు రావడంతో కనిపించింది. టేకాఫ్ సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని ప్రయాణికులు చెబుతున్నారు. ల్యాండింగ్ గేర్ లో కూడా మంటలు వచ్చాయట. విమానంలో మంటలు చెలరేగిన ఘటనతో దాదాపు 40 నిమిషాల పాటు రన్ వేను మూసివేశారు. అంతేకాదు 47 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు అధికారులు.
ఇవి కూడా చదవండి :
- బీఆర్ఎస్‌పై పొంగులేటి మరోసారి ఫైర్… తనను సస్పెండ్ చేయాలని సవాల్
- ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సంస్థల్లో ముగిసిన ఐటి దాడులు… కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
- సిరియా, టర్కీలో భారీ భూకంపం… రెండు దేశాల్లో 560 మందికిపైగా మృతి
- రైతు బజారా??… చోరీ బజారా….??…. ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వాళ్లే ఈ అగంతకుల టార్గెట్…!!
- ఎంఎల్‌ఏల కొనుగోలు కేసులో హైకోర్ట్ కీలక తీర్పు… ప్రభుత్వ అప్పీల్ తిరస్కరణ