
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో కొద్ది నెలలుగా సంచలనంగా మారిన ఎమ్మెల్యే కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసు వ్యవహారం జాతీయ స్థాయిలోనూ చర్చ కు కారణమైంది. ఎమ్మెల్యే కొనుగోలు కేసును సీబీఐ విచారణకు ఆదేశిస్తూ తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ఈ రోజు డివిజన్ బెంచ్ సమర్ధించింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.ఈ ఆదేశాలపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు కొంత సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ కోర్టును కోరారు. అప్పటి వరకు ఆర్డర్‌ను సస్పెండ్‌లో ఉంచాలని అభ్యర్ధించార.
Read Also : నేటి నుండే రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర… మేడారం నుండి ప్రారంభం
అయితే ఆర్డర్ సస్పెన్షన్‌కు హైకోర్టు నిరాకరించింది. రాజకీయ సంచలనానికి కారణమైన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈ కేసును సీబీఐతో విచారించాని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు పైన ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు ముగిసిన అనంతరం జనవరి 18న హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును రిజర్వ్ చేశారు. ఈ మేరకు ఈ రోజు వెలువరించిన తీర్పులో సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం ప్రకటించారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేయడంపై ఈడీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎటువంటి మనీలాండరింగ్ జరగనప్పటికీ ఈడీ కేసు నమోదు చేయడం చెల్లదని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
Also Read : 2,90,396 కోట్ల మొత్తంతో భారీ బడ్జెట్…శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు
ఇటు రాజకీయంగానూ ఈ కేసు కీలకంగా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు కు ప్రయత్నించారంటూ నాటి ఆడియోలు..వీడియోలను అన్ని పార్టీల అధ్యక్షులు…న్యాయమూర్తులకు తెలంగాణ ప్రభుత్వం పంపింది. దీంతో..రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. ఇందులో బీజేపీ నేతల ప్రోత్సహం ఉందంటూ.. కొందరు బీజేపీ నేతల పేర్లు తెర పైక వచ్చాయి. ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ పైన హైకోర్టులో విచారణ జరిగింది. సిట్ ను న్యాయస్థానం రద్దు చేసింది. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చింది. ఇప్పుడు దీని పైన డివిజన్ బెంచ్ కూడా ఆ తీర్పును సమర్థిస్తూ కేసును సీబీఐకి అప్పగించింది. ఇక, ఈ తీర్పు పైన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి :
- విజయమ్మతో పొంగులేటి భేటీ… పార్టీలో చేరికకు ముహూర్తం ఫిక్స్..???
- పద్మభూషన్ అవార్డు గ్రహీత, సినీ నేపధ్య గాయని వాణి జయరాం కన్నుమూత…
- జడ్జికే లాయర్ షోకాజ్ నోటీసు… న్యాయవాదిపై కోర్టు ధిక్కరణ చర్యలు
- రాజేందరన్న ఇక్కడ ఉన్నప్పుడు మంచిగుండే.. అక్కడికి పోయినంక ఆగమైండు..” కేటిఆర్ కీలక వ్యాక్యలు
- అత్యధిక అప్పులున్న మంత్రుల జాబితా… 6వ స్థానంలో కేటిఆర్
One Comment