
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో 2023- 2024 బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ ఎన్నికల ఏడాది బడ్జెట్ కావడంతో బడ్జెట్లో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, రైతు శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్టు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బిజెపి నాయకులు మాత్రం తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ ఫ్లాప్ బడ్జెట్ అంటూ పేర్కొన్న బండి సంజయ్, బడ్జెట్ మొత్తం అంకెల గారడీలా కొనసాగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతే కాదు సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో స్పందించిన బండి సంజయ్ తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీ బడ్జెట్ మాత్రమే కాదు, గందరగోళమైన బడ్జెట్ అంటూ పేర్కొన్నారు.
Read Also : బీఆర్ఎస్‌పై పొంగులేటి మరోసారి ఫైర్… తనను సస్పెండ్ చేయాలని సవాల్
ఈ బడ్జెట్ ప్రజల స్పందన కరువైన బడ్జెట్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సరుకు లేదు.. సంగతి లేదని, సబ్జెక్టు లేదు.. ఆబ్జెక్ట్ లేదని, శుష్కప్రియాలు, శూన్య హస్తాలు తప్ప బడ్జెట్లో సామాన్యులకు కలిగే ఎటువంటి లాభం లేదని పేర్కొన్నారు. నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత వట్టిదే డబ్బా అంటూ వ్యాఖ్యానించారు. బభ్రాజమానం భజగోవిందం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తారని, కెసిఆర్ మాటల్లో తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ పై సెటైర్లు వేశారు బండి సంజయ్. ఇక మరోవైపు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం 2023- 24 బడ్జెట్ పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ అంతా అంకెల గారడీ నేనని విమర్శించారు. 70 80% నిధులు, విధులు కావాలని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఇక రుణమాఫీ ప్రకటించారు ప్రభుత్వం పూర్తిగా రుణమాఫీ చేయాలని కోరుతున్నామన్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, ఉద్యోగులకు హౌసింగ్ రుణాలు కూడా ఇవ్వడం లేదని ఈటల అభిప్రాయపడ్డారు.
Also Read : ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సంస్థల్లో ముగిసిన ఐటి దాడులు… కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
మధ్యాహ్న భోజనం వండే వర్కర్లకు దారుణంగా నెలకు వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తారా అంటూ ప్రశ్నించారు. అవి కూడా సకాలంలో ఇవ్వడం లేదని ఈటల రాజేందర్ మండిపడ్డారు. కెసిఆర్ కిట్ సకాలంలో ఇవ్వడం లేదని, కళాశాలలు, పాఠశాలలలో మౌలిక వసతులు సరిగా లేవని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ బడ్జెట్ లో చాలా డిపార్ట్మెంట్లకు కోత పెట్టారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆరోగ్యశ్రీ, ఈ హెచ్ ఎస్ నిధులు కూడా విడుదల చేయకపోవడంతో ఆసుపత్రులలో ట్రీట్మెంట్లు జరగడం లేదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఎలాంటి సహాయం అందించడం లేదని ఈటల అసహనం వ్యక్తం చేశారు. తాను బడ్జెట్ పై విమర్శలు చేయడం లేదని, ఆర్భాటాలు తప్ప మరేమీ బడ్జెట్లో లేవని ఎద్దేవా చేశారు ఈటల రాజేందర్. హరీష్ రావు మీ గొప్ప దార్శనికతను మాటల్లో కాదు అమల్లో చూపించాలని ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి :
- సిరియా, టర్కీలో భారీ భూకంపం… రెండు దేశాల్లో 560 మందికిపైగా మృతి
- రైతు బజారా??… చోరీ బజారా….??…. ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వాళ్లే ఈ అగంతకుల టార్గెట్…!!
- నియోజకవర్గానికి 2000 మంది లబ్ధిదారులకు 3 లక్షల ఆర్ధిక సహాయం…. దళితబంధుపై కీలక ప్రకటన
- ఎంఎల్‌ఏల కొనుగోలు కేసులో హైకోర్ట్ కీలక తీర్పు… ప్రభుత్వ అప్పీల్ తిరస్కరణ
- 2,90,396 కోట్ల మొత్తంతో భారీ బడ్జెట్…శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు
2 Comments