
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఫిబ్రవరి మొదటి వారంలోనే బడ్జెట్ ప్రజల ముందుకు వచ్చింది. రూ.2,90,396 కోట్ల మొత్తంతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. శాసనసభలో హరీశ్ రావు, శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా మారిన అధికార పార్టీ జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపే దిశగా అడుగులు వేయడం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Also : వచ్చే ఎన్నికల్లో 50 స్థానాలలో పోటీ… అక్బరుద్ధీన్ సంచలన ప్రకటన
– మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు.
– ఎస్సీ ప్రత్యేక నిధి రూ. 36,750 కోట్లు
– ఎస్టీ ప్రత్యేక నిధి రూ. 15,233 కోట్లు
– విద్యా రంగానికి రూ. 19,093 కోట్లు.
– వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు.
– అటవీ శాఖకు రూ. 1,471 కోట్లు.
Also Read : విజయమ్మతో పొంగులేటి భేటీ… పార్టీలో చేరికకు ముహూర్తం ఫిక్స్..???
– దళిత బంధు పథకానికి రూ.17,700 కోట్లు.
– బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
– వ్యవసాయ రంగానికి రూ. 26,831 కోట్లు.
– నీటి పారుదల శాఖకు రూ. 26,885 కోట్లు
– విద్యుత్ రంగానికి కేటాయింపులు రూ. 12,727 కోట్లు
– రూ.2,90,396 కోట్లతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ. 37,525 కోట్లు అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Read Also : జడ్జికే లాయర్ షోకాజ్ నోటీసు… న్యాయవాదిపై కోర్టు ధిక్కరణ చర్యలు
జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. అనంతరం బడ్జెట్ డాక్యుమెంట్లతో అసెంబ్లీకి చేరుకున్నారు. తెలంగాణ క్యాబినెట్ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై వార్షిక బడ్జెట్ 2023ని ఆమోదించింది. అనంతరం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం కూడా లభించింది. ” “కేసీఆర్ ఆలోచనలకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంది. సంక్షేమం, అభివృద్ధి.. రెండు జొడేద్దుల్లాగా సమపాళ్లలో ఉండబోతోంది. కేంద్రం నుంచి వివక్ష కొనసాగుతున్నా, ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి రాకపోయినా అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ముందుకెళుతోంది.” అని మంత్రి హరీష్ రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- పద్మభూషన్ అవార్డు గ్రహీత, సినీ నేపధ్య గాయని వాణి జయరాం కన్నుమూత…
- రాజేందరన్న ఇక్కడ ఉన్నప్పుడు మంచిగుండే.. అక్కడికి పోయినంక ఆగమైండు..” కేటిఆర్ కీలక వ్యాక్యలు
- అత్యధిక అప్పులున్న మంత్రుల జాబితా… 6వ స్థానంలో కేటిఆర్
- కేఏ పాల్ శాపం వల్లే సచివాలయం తగలబడిందా?
4 Comments